నిరుద్యోగులకు ఆర్టీసీ శుభవార్త.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగం – Telugu News | TSRTC Invites applications for apprentice posts, Check here for full details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 20 January 2024

నిరుద్యోగులకు ఆర్టీసీ శుభవార్త.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగం – Telugu News | TSRTC Invites applications for apprentice posts, Check here for full details

తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డిపోల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం మూడేళ్ల కాల వ్యవధికోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏయే రీజియన్స్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో హైదరాబాద్ రీజియన్ (26), సికింద్రాబాద్ రీజియన్‌ (18), మహబూబ్ నగర్ రీజియన్‌ (14), మెదక్ రీజియన్‌ (12), నల్గొండ రీజియన్ (12), రంగారెడ్డి రీజియన్‌ (12), ఆదిలాబాద్ రీజియన్ (09), కరీంనగర్ రీజియన్ (15), ఖమ్మం రీజియన్ (09), నిజామాబాద్ రీజియన్ (09),
వరంగల్ రీజియన్‌ (14) ఖాళీలు ఉన్నాయి. నాన్‌ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఖాళీలకు బీకామ్‌, బీఎస్‌సీ, బీఏ, బీబీఏ, బీసీఏ పూర్తి చేసి ఉండాలి.

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. శిక్షణ వ్యవధి మూడేళ్లుగా ఉంటుంది. మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ.15000, రూ.16000, రూ.17000 స్టైఫండ్ చెల్లిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీగా ఫిబ్రవరి 16వ తేదీని నిర్ణయించారు. టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునే ముందు https://ift.tt/SvOhtQ2 వెబ్‌సైట్‌లో అభ్యర్థులు వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ సందర్శించమని అధికారులు తెలిపారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..No comments:

Post a Comment

Post Bottom Ad

Pages