CSIR-UGC NET 2023 December: సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ డిసెంబర్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలివే.. – Telugu News | CSIR UGC NET 2023 December Notification Released; Exam Date, Eligibility, Application deadline details inside - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday 3 November 2023

CSIR-UGC NET 2023 December: సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ డిసెంబర్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలివే.. – Telugu News | CSIR UGC NET 2023 December Notification Released; Exam Date, Eligibility, Application deadline details inside

సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) డిసెంబర్‌-2023కు నోటిఫికేషన్‌ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసింది. సైన్స్‌ స్పెషలైజేషన్‌లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించేందుకు ప్రతీయేట రెండు సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌ అందిస్తుంది. దీనితోపాటు లెక్చరర్‌షిప్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హతల కోసం సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ పరీక్షను నిర్వహిస్తుంటారు. యూజీసీ నెట్‌ జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందినవారు సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రిసెర్చ్‌ సెంటర్లలో, యూనివర్సిటీల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందిన వారు మాత్రమే పీజీ లేదా పీహెచ్‌డీ తర్వాత యూనివర్సిటీలు లేదా డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది.

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2023 దరఖాస్తు చేసుకునేందుకు ప్రధానంగా అయిదు సబ్జెక్టుల్లో అవకాశం కల్పిస్తారు. కెమికల్‌ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్, మ్యాథమేటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌.. ఈ 5 సబ్జెక్టుల్లో అవకాశం కల్పిస్తారు. కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ లేదా తత్సమాన పీజీ డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌- ఎంఎస్‌/బీఈ/బీటెక్‌/బీఫార్మసీ/ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ (ఎన్‌సీఎల్‌), ఎస్సీ/ఎస్టీ/థర్డ్‌జెండర్‌/దివ్యాంగ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు సీఎస్‌ఐఆర్‌ నెట్‌అర్హత పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు పొందితేనే అర్హత సాధించినట్లు పరిగణిస్తారు.

జేఆర్‌ఎఫ్‌కు అర్హతకు సంబంధించి దరఖాస్తుదారుల వయసు జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకైతే జులై 1, 2023 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ (నాన్‌ క్రిమిలేయర్‌) కేటగిరి అభ్యర్ధులు మూడేళ్ల వరకు వయోసడలింపు ఉంటుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/లెక్చరర్‌షిప్‌కు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి నిబంధన లేనట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్థులకు రూ.1100, జనరల్ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.550, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.275, థర్డ్ జెండర్ అభ్యర్ధులు రూ.275 చెల్లించాలి. దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.ఆన్‌లైన్‌ దరఖాస్తులకు నవంబర్‌ 30, 2023వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. డిసెంబర్‌ 26, 27, 28 తేదీల్లో పరీక్ష జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages