Ap Lawcet: లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌..సుమారు ఆరునెల‌ల త‌ర్వాత అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌.. – Telugu News | Ap Lawcet counselling schedule released - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday 16 November 2023

Ap Lawcet: లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌..సుమారు ఆరునెల‌ల త‌ర్వాత అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌.. – Telugu News | Ap Lawcet counselling schedule released

కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లా సెట్, పీజీ లాసెట్ అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌కు ఎట్ట‌కేల‌కు షెడ్యూల్ విడుద‌ల చేసింది ప్ర‌భుత్వం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉన్న‌త‌ విద్యామండ‌లి ఆధ్వ‌ర్యంలో నాగార్జున యూనివ‌ర్శిటీ లాసెట్ ను నిర్వ‌హించింది..ఈ ఏడాది మే 20 వ తేదీన లాసెట్, పీజీ లాసెట్ ప‌రీక్ష‌లు జ‌రిగాయి..అయితే వివిధ కార‌ణాల‌తో అడ్మిష‌న్ల ప్ర‌క్రియ మాత్రం ప్రారంభం కాలేదు.. ఎట్ట‌కేల‌కు అడ్మిష‌న్ల‌కు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్న‌త‌విద్యామండ‌లి జారీ చేసింది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అడ్మిష‌న్ల ప్ర‌క్రియ మొత్తం జ‌ర‌గ‌నుంది..

కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే

ఆన్ లైన్ లో రిజిస్ట్రేష‌న్ – న‌వంబర్ 17 నుంచి 20 వ తేదీ వ‌ర‌కూ

స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ – న‌వంబ‌ర్ 18 నుంచి 22 వ తేదీ వ‌ర‌కూ

స్పెష‌ల్ కేట‌గిరీ అభ్య‌ర్ధుల‌కు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ – నవంబ‌ర్ 21.

వెబ్ ఆప్ష‌న్ల న‌మోదు – న‌వంబ‌ర్ 23 నుంచి 25 వ తేదీ వ‌ర‌కూ

వెబ్ ఆప్ష‌న్లు మార్చున‌కు అవ‌కాశం – న‌వంబర్ 26.

సీట్ల కేటాయింపు – న‌వంబ‌ర్ 28

కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సింది – న‌వంబ‌ర్ 29,30వ తేదీలు.



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages