TSPSC AE & JTO Hall Ticket 2023: టీఎస్పీయస్సీ ఏఈ, జేటీవో పోస్టులకు హల్‌టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలు ఇవే.. – Telugu News | TSPSC Releases AE, JTO 2023 Re exam Hall Tickets, check details here - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday 13 October 2023

TSPSC AE & JTO Hall Ticket 2023: టీఎస్పీయస్సీ ఏఈ, జేటీవో పోస్టులకు హల్‌టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలు ఇవే.. – Telugu News | TSPSC Releases AE, JTO 2023 Re exam Hall Tickets, check details here

హైదరాబాద్‌, అక్టోబర్‌ 12: తెలంగాణ రాష్ట్రలో వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులన్నింటినీ కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ద్వారా భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్లను తాజాగా కమిషన్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 14, 15 తేదీల్లో అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవల్సిందిగా టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక రాత పరీక్షలు అక్టోబర్ 18, 19, 20 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్‌ విధానంలో పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

అక్టోబర్‌ 20న ఐడీబీఐ అసిస్టెంట్‌ మేనేజర్‌ రాత పరీక్ష.. వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు

ఐడీబీఐ బ్యాంకులో దాదాపు 600 అసిస్టెంట్ మేనేజ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి సంబంధించి రాత పరీక్ష హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ లేదా రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలు నమోదు చేసి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవల్సిందిగా ఐబీబీఐ సూచించింది. రాత పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఈ పోస్టుల‌ను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సు ద్వారా భ‌ర్తీ చేయ‌నుంది. ఎంపికైన‌ వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది పాటు పీజీడీబీఎఫ్‌ కోర్సులో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కోర్సు పూర్తి చేసుకున్నవారికి జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ (గ్రేడ్‌-ఓ) ఉద్యోగం సొంతమవుతుంది.

తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌కు ‘బీటెక్‌-బీఈడీ’ అభ్యర్థులు కూడా అర్హులే!

ఇటీవల తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. టెట్‌ పరీక్షలో అర్హత సాధించిన వారందరికీ డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ కొలువులు సొంతం చేసుకునేందుకు అర్హత ఉంటుంది. అయితే వీరితోపాటు బీఈడీ పూర్తి చేసిన బీటెక్‌ విద్యార్థులు కూడా ఇకపై డీఎస్సీ ఉపాధ్యాయ కొలువులకూ పోటీపడొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం నడుస్తోన్న డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని.. ఈ మేరకు తెలుపుతూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా 2015 నుంచి బీటెక్‌ విద్యార్థులకు బీఈడీలో చేరేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వగా.. అప్పటి నుంచి ప్రతి ఏటా వందల మంది బీటెక్‌ విద్యార్థులు బీఈడీ కోర్సులో ప్రవేశం పొంది ఉత్తీర్ణులవుతున్నారు. 2017లో జరిగిన టెట్‌ రాసేందుకు వారికీ కూడా అవకాశం ఇచ్చారు. అయితే అప్పటి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన వెలువడలేదు. తాజాగా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వడంతో ఎస్‌ఏ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ పోస్టులకు బీటెక్‌-బీఈడీ అభ్యర్ధులు పోటీపడొచ్చని స్పష్టం చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages