అనాథలా తెలంగాణ వర్సిటీ.. రెగ్యులర్ వైస్ ఛాన్సులర్ లేరూ.. పాలకమండలి రద్దు – Telugu News | Telangana varsity become care of problems Know full details Telugu News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday 4 October 2023

అనాథలా తెలంగాణ వర్సిటీ.. రెగ్యులర్ వైస్ ఛాన్సులర్ లేరూ.. పాలకమండలి రద్దు – Telugu News | Telangana varsity become care of problems Know full details Telugu News

తెలంగాణ విశ్వవిద్యాలయం అనాథలా మారింది. వైస్ చాన్సులర్ ఏసీబీకి పట్టుబడి సస్పెండ్ కాగా.. యూనివర్సిటీకి ఉపకులపతి లేకుండా పోయారు. ఇటు పాలక మండలి పదవీ కాలం ముగియడంతో.. ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త విద్యా సంవత్సరం మొదలైనా.. కొత్త కోర్సు ఊసులేక.. అధ్యాపకుల కొరత, హాస్టల్స్ సరిపోక విద్యార్ధులు నానాఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం పేరుతో ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో నిర్లక్ష్య రాజ్యమేలుతోంది… నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని.. తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమస్యలు కంటిన్యూ అవుతున్నాయి. వైస్ చాన్సులర్ గా రవీందర్ గుప్తా రెండేళ్లకు పైగా విధులు నిర్వర్తించారు. ఆయన హయాంలో అనేక అవినీతి ఆరోపణలు, అక్రమ నియామక వివాదాలు ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. విద్యార్ధుల ఆందోళనలు, పాలక మండలి ప్రభుత్వానికి రాసిన లేఖలతో.. ఎట్టకేలకు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

ఒక వైపు విచారణ కొనసాగుతుండగా రూ. 50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి వీసీ రవీందర్ గుప్తా పట్టుబడ్డారు. పాలక మండలిని సైతం ప్రభుత్వం రద్దు చేస్తూ.. జీవో జారీ చేసింది. పాలక మండలి రద్దు, వైస్ చాన్సులర్ జైలుకు వెళ్లడంతో..ఇంజార్జ్ విసి గా వాకాటి కరుణను నియమించింది ప్రభుత్వం… ఐతే వర్సిటీకి గుండెకాయ లాంటి రెగ్యులర్ వైస్ చాన్సులర్ నియమకాన్ని చేపట్టకపోవడం పట్ల విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీని అనాథలా వదిలేశారని.. మండిపడుతున్నారు..

సమస్యల నిలయంగా యూనివర్సిటి విద్యార్థులు..

ఇవి కూడా చదవండి

తెలంగాణ విశ్వవిద్యాలయం సమస్యలకు నిలయంగా మారింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై విద్యార్ధులు ఎన్నో ఆశలతో వర్సిటీలో అడుగు పెడుతున్నారు. అధ్యాపకుల కొరత, హాస్టల్ సమస్యలతో సతమతమవుతున్నారు. కొత్త కోర్సులను ప్రవేశ పెడతామని ప్రకటనలు చేస్తున్నా.. అవి కాగితాలకు పరిమితం అవుతున్నాయి. బాలికల హాస్టల్ లో విద్యార్ధినీలు వసతికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో హాస్టల్ నిర్మాణం చేయాల్సి ఉన్నా.. నిర్ణయాలు తీసుకునే అధికారి లేకపోవడంతో పెండింగ్ లో పడింది. ఇలా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పరిపాలన పూర్తిగా స్తంభించిందని.. విద్యార్ధి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీకి రెగ్యేలర్ వైస్ చాన్సులర్ గా నియమించాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..No comments:

Post a Comment

Post Bottom Ad

Pages