కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఎన్నో రంగాలపై ఈ మహమ్మారి ప్రభావం పడింది. దీంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. చాలా రంగాల్లో భారీగా కోతలు పెట్టారు. ఇక ఆ తర్వాతే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కూడా ఆర్థిక రంగాలు కుదేలయ్యాయి. ప్రస్తుతం ఐటీ సంస్థల్లో కోతలు కలవరపెడుతున్నాయి. టాప్ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఓ రంగం మాత్రం దూసుకుపోతోంది. ముఖ్యంగా భారత్‌లో ఈ రంగంలో రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగవకాశాలు రానున్నాయి. భారత్‌లోని ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ రంగంలో రానున్న నెలల్లో వేలాది ఉద్యోగవకాశాలు రానున్నాయి. పండుగల సీజన్‌లో ప్రయాణాలు పెరగడంతో ట్రావెల్ రంగంలో ఉద్యోగవకాశాలు పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. స్టాఫింగ్ కంపెనీ టీమ్‌లీజ్ ప్రకారం.. పండుగ సీజన్‌లో ప్రయాణానికి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది.
దీంతో పాటు క్రికెట్ ప్రపంచకప్ కారణంగా ప్రయాణాలకు డిమాండ్ కూడా పెరిగింది. ఈసారి ఐసీసీ పురుషుల ప్రపంచకప్ భారతదేశంలోని వివిధ నగరాల్లో జరుగుతోంది. దాదాపు 10 నగరాల్లో నిర్వహించిన ఈ టోర్నీ పర్యాటక రంగానికి ఊపునిచ్చింది. దీని వల్ల రాబోయే నెలల్లో 70,000-80,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని టీమ్‌లీజ్ అంచనా వేసింది. ఇక కోవిడ్ తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో హోటల్ బుకింగ్‌లు జరగడం ఇదే మొదటి సంవత్సరం కావడం విశేషం.
వచ్చే పండుగల సీజన్‌లో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ITC మద్దతు ఉన్న ఫార్చ్యూన్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్‌తో పాటు మరిన్ని పెద్ద, మధ్యతరహా హోటళ్లు డిమాండ్‌కు అనుగుణంగా చిన్న, నాన్ బ్రాండెడ్ హోటళ్లను కొనుగోలు చేస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం వచ్చే ఏడాదిలో కంపెనీలు 1500 నుంచి 3000 మందిని నియమించుకోనున్నాయిని కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. ఈ డిమాండ్‌ను చూసి ఇతర కంపెనీలు కూడా ఉద్యోగులను నియమించుకుంటాయని భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హాస్పిటాలిటీ మేనేజర్, ఈవెంట్ ప్లానర్, కోఆర్డినేటర్, రెస్టారెంట్ స్టాఫ్, లాజిస్టిక్స్ మేనేజర్, డ్రైవర్స్ వంటి ఉద్యోగాలు భారీగా పెరగునన్నాయి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
No comments:
Post a Comment