EMRS Last Date: ఏకలవ్య పాఠశాలల్లో 10,391 బోధన, బోధనేతర కొలువుల భర్తీకి దరఖాస్తుకు గడువు పెంపు.. చివర తేదీ ఇదే.. – Telugu News | NEST extends application deadline for filling 10,391 teaching and non teaching posts in Ekalavya schools - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday 17 October 2023

EMRS Last Date: ఏకలవ్య పాఠశాలల్లో 10,391 బోధన, బోధనేతర కొలువుల భర్తీకి దరఖాస్తుకు గడువు పెంపు.. చివర తేదీ ఇదే.. – Telugu News | NEST extends application deadline for filling 10,391 teaching and non teaching posts in Ekalavya schools

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల (EMRS)లో 10,391 బోధన, బోధనేతర ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పెంపొందిస్తూ నెస్ట్స్‌ ఓ ప్రకటనలో తెల్పింది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (NESTS) ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో పోస్టుల నియామక ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఉద్యోగాల దరఖాస్తు గడువును పొడిగించినట్లు నెస్ట్స్‌ ప్రకటన వెలువరించింది.

ఈ నోటిఫికేషన్‌ కింద ప్రిన్సిపల్, పీజీటీ, జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్, ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు జులై 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. 6,329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టులకు ఆగస్టు 18న దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే అభ్యర్ధుల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు తాజాగా దరఖాస్తు గడువును పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్‌ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 19వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని నెస్ట్స్‌ ఈ సందర్భంగా తెలిపింది. ఇదే చివరి అవకాశం అని, దీనిని సద్వినియోగ పరచుకోవాలని వెల్లడించింది. ఈ పోస్టులను ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023 (SSC), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఖాళీల వివరాలు..

  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు: 5,660
  • హాస్టల్ వార్డెన్ (పురుషులు) పోస్టులు: 335
  • హాస్టల్ వార్డెన్ (మహిళలు) పోస్టులు: 334
  • ప్రిన్సిపల్ పోస్టులు: 303
  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) పోస్టులు: 2,266
  • అకౌంటెంట్ పోస్టులు: 361
  • జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్ పోస్టులు: 759
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 373

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages