AP SI Mains Answer Key: ఎస్సై తుది రాతపరీక్షల ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి.. - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday 17 October 2023

AP SI Mains Answer Key: ఎస్సై తుది రాతపరీక్షల ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

AP SI Mains Answer Key: ఎస్సై తుది రాతపరీక్షల ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

అమరావతి, అక్టోబర్ 16: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సై తుది రాత పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో శనివారం (అక్టోబర్‌ 14) జరిగిన పేపర్‌ 1 (ఇంగ్లిష్‌), పేపర్‌-2 (తెలుగు) పరీక్షలకు 30,585 మంది హాజరయ్యారు. దాదాపు 608 మంది అభ్యర్ధులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. రెండో రోజైన ఆదివారం (అక్టోబర్‌ 15) జరిగిన పేపర్‌ 3 అంటూ అరిథ్‌మెటిక్‌, మెంటల్‌ ఎబిలిటీ పరీక్షకు 30,569 మంది హాజరుకాగా.. పేపర్‌ 4 జనరల్‌ స్టడీస్‌ పరీక్షకు 30, 560 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. దీంతో ఎస్సై ఉద్యోగాలకు నియామక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

పరీక్షలు ముగిసిన మురుసటి రోజే అంటే సోమవారం నాడే పేపర్‌ 3, 4 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ప్రిలిమినరీ ఆన్సర్‌ కీలను ఏపీ పోలీస్‌ నియామక మండలి (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) విడుదల చేసింది. ప్రిలిమినరీ ఆన్సర్‌ కీలో సమాధానాలపై అభ్యంతరాలను అక్టోబర్‌ 18వ తేదీ సాయంంత్రం 5 గంటలలోగా అభ్యంతరాలు లేవనెత్తాలని బోర్డు తెల్పింది. నిర్ణీత ఫార్మాట్‌లో మెయిల్‌ ద్వారా మాత్రమే అభ్యంతరాలు తెలియజేయాలని బోర్డు సూచించింది. ప్రైమరీ కీపై వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం తుది కీతో పాటు ఫలితాలు కూడా బోర్డు విడుదల చేయనుంది.

కాగా మొత్తం 411 ఎస్సై ఉద్యోగాల భర్తీకి ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఇటీవల శారీరక కొలతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫలితాలను కూడా ఇటీవల వెలువరించింది. పీఎంటీ, పీఈటీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈనెల 14, 15 తేదీల్లో మెయిన్‌ రాత పరీక్షలు నిర్వహించింది. ఎస్సై మెయిన్స్‌ పరీక్షలు మొత్తం 4 పేపర్లకు నిర్వహించారు. రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో, రెండు పేపర్లు డిస్క్రిప్టివ్‌ విధానంలో జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్‌ కీలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages