AP Inter Exam Fee 2024: ఇంటర్‌ ప్రైవేటు అభ్యర్థుల పరీక్ష ఫీజు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే – Telugu News | AP Inter Exam 2024 Fee: Intermediate Private candidates examination fee deadline extended till 30th November - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 7 October 2023

AP Inter Exam Fee 2024: ఇంటర్‌ ప్రైవేటు అభ్యర్థుల పరీక్ష ఫీజు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే – Telugu News | AP Inter Exam 2024 Fee: Intermediate Private candidates examination fee deadline extended till 30th November

అమరావతి, అక్టోబర్‌ 6: ఇంటర్మీడియట్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు పరీక్ష ఫీజు చెల్లించే గడువును ఏపీ ఇంటర్ బోర్డు పొడిగించింది. ఈ మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును నవంబరు 30 వరకు గడువు పొడిగిస్తూ ఇంటర్‌ విద్యామండలి ప్రకటించింది. స్థూల ప్రవేశాల నిష్పత్తి కోసం ప్రభుత్వం ఫెయిల్‌ అయిన ప్రైవేటు అభ్యర్థులు సైతం రెగ్యులర్‌గా చదివేందుకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇంటర్‌లో హాజరు మినహాయింపునకు ఫీజు గడువు నవంబరు 30 వరకు పొడిగిస్తూ ప్రైవేటు విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది.

కాగా వచ్చే ఏడాది 2024 మార్చిలో నిర్వహించే ఇంటర్మీడియట్‌ పరీక్షలకు రెగ్యులర్‌ విద్యార్ధులతోపాటు ప్రైవేటు విద్యార్థులు కూడా హాజరు కానున్నారు. వీరికి హాజరు మినహాయింపునిస్తూ ఇంటర్‌ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం నవంబరు 30 లోపు ప్రైవేటు విద్యార్ధులు రూ.1500 ఫీజు చెల్లించాలని బోర్డు సూచించింది. రూ.500తో ఆలస్య రుసుముతో డిసెంబరు 31వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు ఈ సందర్భంగా తన ప్రకటనలో తెల్పింది.

ఆర్‌బీఐ అసిస్టెంట్ నియామక పరీక్ష తేదీలు విడుదల! నవంబర్‌లో ప్రిలిమ్స్‌.. డిసెంబర్‌లో మెయిన్స్‌

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 450 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్షల తేదీలను తాజాగా విడుదల చేసింది. గతంలో ఇచ్చిన తేదీలకు బదులుగా కొత్త పరీక్ష తేదీలను ఆర్‌బీఐ ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను నవంబర్‌ 18, 19 తేదీల్లో నిర్వహించనుంది. ఇక మెయిన్‌ పరీక్షను డిసెంబర్‌ 31వ తేదీన నిర్వహించనున్నట్లు ఈ మేరకు ఆర్బీఐ వెల్లడించింది. కాగా ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులను ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా భర్తీ చేయనుంది. నియామక ప్రక్రియలో మెరిట్‌ కనబరచిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఉద్యోగాలు పొందిన వారు నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 వరకు జీతంగా అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages