TS TET 2023 Results: తెలంగాణ టెట్‌-2023 ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి.. – Telugu News | Telangana TET 2023 Result Declared, direct link here - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday 28 September 2023

TS TET 2023 Results: తెలంగాణ టెట్‌-2023 ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి.. – Telugu News | Telangana TET 2023 Result Declared, direct link here

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2023) ఫలితాలు బుధవారం (సెప్టెంబర్‌ 27) విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలతోపాటు తుది ఆన్సర్‌ కీ కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. తుది ఆన్సర్‌ కీ   లను కూడా వెబ్ సైట్లో పొందుపరిచారు.

కాగా సెప్టెంబర్‌ 15న టెట్‌ పరీక్ష జరగ్గా.. పేపర్‌ 1 పరీక్ష కు 2.26 లక్షల మంది, పేపర్‌ 2 పరీక్షకు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరైన సంగతి తెలిసిందే. ఒక్కసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితకాల పరిమితి ఉంటుంది. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్రతీసారి భారీ సంఖ్యలో టెట్‌ పరీక్షకు హాజరవుతున్నారు. తాజాగా నిర్వహించిన టెట్ పరీక్షలో అభ్యర్ధులు భారీగానే ఉత్తీర్ణత సాధించినట్లు తెలుస్తోంది.

వారంతా డీఎస్సీకి అర్హులే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో 2,575 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT) పోస్టులు, 1739 స్కూల్‌ అసిస్టెంట్‌ (SA) పోస్టులు, 611 భాషా పండితులు పోస్టులు, 164 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది. తాజాగా టెట్‌లో అర్హత సాధించిన వారు కూడా టీఆర్టీ 2023కి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలిగింది. టెట్‌ అర్హతతోపాటు అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలి. టీఆర్టీ ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణ అక్టోబర్ 21, 2023వ తేదీ వరకు కొనసాగనుంది. దరఖాస్తు ఫీజు కింద ప్రతిఒక్కరూ రూ.1000 రుసుము తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ టెట్-2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి.

తెలంగాణ టెట్-2023 తుదీ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages