తెలంగాణలో గ్రూప్ 4 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పరీక్షకు ఇంకా వారం రోజులే ఉన్న నేపథ్యంలో హాల్ టికెట్స్ ఎప్పుడొస్తాయా అని వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గ్రూప్ 4 పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూల్ 1వ తేదీన షెడ్యూల్ ప్రకారమే పరీక్ష జరగనుంది…
తెలంగాణలో గ్రూప్ 4 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పరీక్షకు ఇంకా వారం రోజులే ఉన్న నేపథ్యంలో హాల్ టికెట్స్ ఎప్పుడొస్తాయా అని వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గ్రూప్ 4 పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూల్ 1వ తేదీన షెడ్యూల్ ప్రకారమే పరీక్ష జరగనుంది. పేపర్ 1 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ 2 పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
గ్రూప్4 నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 8,180 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకుగాను మొత్తం 9.51 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే హాల్ టికెట్ల విడుదలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే తాజా సమాచారా ప్రకారం 24 లేదా 25వ తేదీలో గ్రూప్ 4 హాల్ టికెట్లను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక గ్రూప్ 4 పరీక్షలను వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలుగా కాగా అందుకు కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
No comments:
Post a Comment