TS WCDS Jobs 2023: రత పరకషలకడ యదదర భవనగర జలలల పరభతవ కలవల.. ఇటర/డగర పసత చల.. Telugu News | Yadadri Bhuvanagiri District WCDS Recruitment 2023 for 8 Project Coordinator Counsellor and other Posts - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday 15 June 2023

TS WCDS Jobs 2023: రత పరకషలకడ యదదర భవనగర జలలల పరభతవ కలవల.. ఇటర/డగర పసత చల.. Telugu News | Yadadri Bhuvanagiri District WCDS Recruitment 2023 for 8 Project Coordinator Counsellor and other Posts

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా శిశు దివ్యాంగుల, వయోవృధ్ధుల సంక్షేమ శాఖ.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పాజెక్టు కో ఆర్డినేటర్, కౌన్సిలర్, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌ వైజర్, కేస్‌ వర్కర్‌ పోస్టుల భర్తీకి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా శిశు దివ్యాంగుల, వయోవృధ్ధుల సంక్షేమ శాఖ.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పాజెక్టు కో ఆర్డినేటర్, కౌన్సిలర్, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌ వైజర్, కేస్‌ వర్కర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఏయే అర్హతలుండాలంటే..

  • ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ పోస్టులకు సోషల్‌ వర్క్‌ స్పెషలైజేషన్‌లో పీజీ, డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
  • కౌన్సిలర్‌ పోస్టులకు సోషల్‌ వర్క్‌లో గ్రాడ్యుయేషన్‌, పీజీ, డిప్లొమాలో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
  • చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత ఉండాలి. కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
  • కేస్‌ వర్కర్‌ పోస్టులకు ఇంటర్‌ ఉత్తీర్ణత ఉంటే చాలు.
  • అన్ని పోస్టులకు వయసు 21 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో జూన్‌ 17, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌లో దరఖాస్తులు సమర్పించాలి. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,600ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

జిల్లా సంక్షేమశాఖ, బ్లాక్‌ నం: జీ-01, జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, రాయగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ.

ఇవి కూడా చదవండి



నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages