TS Gurukulam Exam Dates: తలగణ నరదయగలక అలరట.. గరకల టచర కలవలక పరకషల తదల వచచశయ.. Telugu News | TREIRB will conduct Gurukula Teacher Recruitment Exams from 1st to 23rd August in online mode - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday 16 June 2023

TS Gurukulam Exam Dates: తలగణ నరదయగలక అలరట.. గరకల టచర కలవలక పరకషల తదల వచచశయ.. Telugu News | TREIRB will conduct Gurukula Teacher Recruitment Exams from 1st to 23rd August in online mode

TS Gurukulam Teacher Exam Dates: తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో టీచర్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష తేదీలను నియామక బోర్డు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని నియామక బోర్డు (TREIRB) కార్యనిర్వాహక..

TS Gurukulam Teacher Exam Dates: తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో టీచర్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష తేదీలను నియామక బోర్డు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని నియామక బోర్డు (TREIRB) కార్యనిర్వాహక అధికారి మల్లయ్య బట్టు గురువారం (జూన్‌ 15) తెలిపారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రకటన జూన్ 17న ప్రకటించనున్నట్లు తెలిపారు. జేఎల్, డీఎల్, పీజీటీ, టీజీటీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న విషయం తెలిసిందే.

కాగా రాష్ట్రంలోని గురుకుల సొసైటీల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో 9 నోటిఫికేషన్ల ద్వారా దాదాపు 9,210 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఏప్రిల్‌ 5న గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి ఏప్రిల్‌ 14 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 2,63,045 వరకు దరఖాస్తులు అందాయి. వీటిల్లో 1.6 లక్షల దరఖాస్తులు టీజీటీ, పీజీటీ పోస్టులకు కలిపి రావడం విశేషం. ఇక నియామక పరీక్షలను తొలుత ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించాలని బోర్డు భావించినప్పటికీ లీకుల నేపథ్యంలో సీబీఆర్‌టీ విధానమే బెస్ట్‌ అని నిర్ణయించింది. వేగంగా పరీక్షలు నిర్వహించి, ఆ త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు 9,210

విభాగాల వారీగా పోస్టుల వివరాలు ఇవే..

  • టీజీటీ పోస్టులు: 4,006
  • మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులు: 123
  • క్రాఫ్ట్‌ టీచర్ పోస్టులు: 88
  • ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు: 275
  • లైబ్రేరియన్‌ పోస్టులు: 434
  • ఆర్ట్‌ టీచర్‌ పోస్టులు: 132
  • పీజీటీ పోస్టులు: 1,276
  • జేఎల్ పోస్టులు: 2,008
  • డీఎల్ పోస్టులు: 868

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages