Top NITs of India: దశలన పరసదధ ఇజనరగ కలజల ఇవ.. అడమషన పరతయత ఉదయగ ఖయ..! Telugu News | Engineering College Admission 2023: List of top NIT colleges of India
Top NITs of India: ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశం కోసం రాసిన JEE అడ్వాన్స్‌డ్ పరీక్షా ఫలితాలు రెండు రోజులు క్రితం విడుదలయ్యాయి. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీల్లో అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్ తీసుకునే ముందు దేశంలోని టాప్ ఎన్ఐటీ కాలేజీల గురించి తెలుసుకోండి. NIRF ర్యాంకింగ్ 2023 ఆధారంగా దేశంలో టాప్ 5 ఎన్‌ఐటీలుగా ఏయే కాలేజీలు ఉన్నాయంటే..?
Jun 20, 2023 | 4:32 PM
1. NIT Tiruchirappalli: దేశంలోని అగ్రశ్రేణి ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ కాలేజీల గురించి చెప్పాలంటే, NIT తిరుచిరాపల్లి ఆగ్రస్థానంలో ఉంది. కేంద్ర విద్యా శాఖ విడుదల చేసిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ఇంజినీరింగ్ కాలేజీల జాబితాలో దీనికి 9వ ర్యాంక్ వచ్చింది. గతేడాది యూజీకి ప్లేస్‌మెంట్ రేటు 90.2% కాగా, పీజీకి 92.9%. ఇక్కడకు హెచ్‌సిఎల్, విప్రో, గోద్రెజ్, గూగుల్ వంటి కంపెనీలు ప్లేస్‌మెంట్ కోసం వస్తున్నాయి.
2. NIT Surathkal: NIRF ర్యాంకింగ్ ప్రకారం, NIT సురత్కల్ ఈ సంవత్సరం 12వ ర్యాంక్ పొందింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ స్కోర్ ఆధారంగా ఈ సురత్కల్ కాలేజీలో ప్రవేశం కల్పిస్తారు. ముఖ్యంగా ఈ కాలేజీలోని ప్లేస్‌మెంట్ విధానం విద్యార్థులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తోంది. గతేడాది ఈ కాలేజీలో అత్యధిక ప్లేస్‌మెంట్ ప్యాకేజీ 12.84 లక్షలు.
3. NIT Rourkela: ఎన్‌ఐటీ రూర్కెలా ఇంజనీరింగ్ విద్యార్థులకు మొదటి ఎంపికగా ఉంటుంది. ఈ కాలేజీ దాని వాతావరణం, క్యాంపస్‌తో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. రూర్కెలా ఎన్ఐటీలో ప్లేస్‌మెంట్ గురించి చెప్పుకోవాలంటే, గతేడాది 325 కంపెనీలు నుంచి 1275 ప్లేస్‌మెంట్ ఆఫర్‌లు వచ్చాయి.
4. NIT Warangal: 2021-22 విద్యా సంవత్సరంలో NIT వరంగల్‌లో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ల సంఖ్య దేశంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏకంగా 1,340 మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ సువర్ణావకాశాన్ని పొందారు. ఈ ఏడాది ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో NIT వరంగల్ 21వ ర్యాంకు సాధించింది.
5. NIT Calicut: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ ఈ సంవత్సరం NIRF ర్యాంకింగ్‌లో చాలా లాభపడింది. గతేడాది 31వ ర్యాంక్‌లో ఉన్న ఈ కాలేజీ ఈసారి 23వ స్థానానికి చేరుకుంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్ విషయంలో NIT కాలికట్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి.
No comments:
Post a Comment