NEET-PG Ranks: నట పజ- 2023 రయకల వచచశయ.. టపరల వర Telugu News | NEET PG NTRUHS Topper List 2023: NEET PG 2023 Counselling Likely To Begin in July - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday 16 June 2023

NEET-PG Ranks: నట పజ- 2023 రయకల వచచశయ.. టపరల వర Telugu News | NEET PG NTRUHS Topper List 2023: NEET PG 2023 Counselling Likely To Begin in July

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీటీ పీజీ ప్రవేశ పరీక్ష-2023కు సంబంధించిన ర్యాంకులు విడుదలయ్యాయి. నీట్‌ పీజీ ర్యాంకుల ప్రాధాన్య క్రమాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ తాజా జాబితాను..

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీటీ పీజీ ప్రవేశ పరీక్ష-2023కు సంబంధించిన ర్యాంకులు విడుదలయ్యాయి. నీట్‌ పీజీ ర్యాంకుల ప్రాధాన్య క్రమాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ తాజా జాబితాను జూన్ 14 (బుధవారం) మెడికల్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది. మెడికల్‌ పీజీ (ఎండీ/ఎంఎస్‌)లో మొత్తం 8,667 మంది అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. పీజీ దంత వైద్య (ఎండీఎస్‌) విభాగంలో 672 మంది ర్యాంకులు సాధించినట్లు వెల్లడించింది. మెరిట్‌ ఆర్డర్‌లో ఆయా ర్యాంకుల లిస్టును ప్రకటించింది.

మెడికల్‌ పీజీ ఎండీ/ఎంఎస్‌ కోర్సులో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1200 సీట్లు, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 1400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. పీజీ డెంటల్‌ విభాగంలో సుమారు 375 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్‌ ద్వారా వీరందరికీ సీట్లు కేటాయిస్తారు. ఇతర వివరాలు వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మెడికల్‌ పీజీ (ఎండీ/ఎంఎస్‌)లో.. పి లక్ష్మీపూజిత 22వ ర్యాంకు, పి కృష్ణ మణదీప్‌ యాదవ్‌ 151 ర్యాంకు, అవుతు గుణవర్ధన్‌ రెడ్డి 158వ ర్యాంకు సాధించారు. డెంటల్ పీజీలో బి స్వప్న 43వ ర్యాంకు, సీహెచ్‌ జాస్మిత 67వ ర్యాంకు, డి మౌనిక 91 ర్యాంకు సాధించారు.

ఇవి కూడా చదవండి

మెడికల్‌ పీజీ ఎండీ/ఎంఎస్‌ లిస్ట్-2023

మెడికల్ ఎండీఎస్ లిస్ట్-2023

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages