ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం, బందర్ ఉమ్మడి జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన జూనియర్ కాలేజీల్లో పీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 32 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు..

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం, బందర్ ఉమ్మడి జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన జూనియర్ కాలేజీల్లో పీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 32 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తాహెరాసుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా మూడ విడతల కౌన్సెలింగ్ ఆధారంగా సబ్జెక్టుల వారీగా ఎంపిక చేస్తామని తెలిపారు.
పీజీలో 50 శాతం పైబడి మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్‌ట్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తుకు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు మే 31న మచిలీపట్నంలోని డీఈవో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నేరుగా హాజరు కావాలని ఆమె సూచించారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment