ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నాగ్‌పుర్‌లోని ఈ సంస్థల పలు విభాగాల్లో ఉన్న మొత్తం 58 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? అర్హత ఏంటి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు?
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నాగ్‌పుర్‌లోని ఈ సంస్థల పలు విభాగాల్లో ఉన్న మొత్తం 58 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? అర్హత ఏంటి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు?లాంటి పూర్తి వివరాలు మీకోసం..
నోటిఫికేషన్‌లో భాగంగా గ్రూప్ ఎలోని పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ డిప్యూటేషన్/ కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకోనున్నారు. మొత్తం 58 ఖాళీల్లో 11 ప్రొఫెసర్, 09 అడిషనల్ ప్రొఫెసర్, 15 అసోసియేట్ ప్రొఫెసర్, 23 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. అనస్థీషియాలజీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం, ఫోరెన్సిక్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పైన తెలిపిన పోస్టులకు దరఖౄస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతత సాధించి ఉండాలి.
దీంతో పాటు సంబంధిత విభాతంలో పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పని అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ రూ.2,000 చెల్లించాలి. దరఖాస్తుల స్వీకరణకు 23-07-2023తో ముగియనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
No comments:
Post a Comment