UPSC Toppers: చదువు ఒక్కటే తమ పరిస్థితులను మార్చగలదు.. సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన ఉమ్మడి ఆదిలాబాద్ విద్యార్థులు.. – Telugu News | UPSC Civil Services 2022 Final Result Students from Joint Adilabad District Get best Ranks - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 23 May 2023

UPSC Toppers: చదువు ఒక్కటే తమ పరిస్థితులను మార్చగలదు.. సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన ఉమ్మడి ఆదిలాబాద్ విద్యార్థులు.. – Telugu News | UPSC Civil Services 2022 Final Result Students from Joint Adilabad District Get best Ranks

సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు తేజాలు సత్తా చాటారు. సివిల్స్ ఫలితాల్లో సత్త చాటిన మరో ఉమ్మడి ఆదిలాబాద్ బిడ్డ అజ్మీరా సాంకేత్‌ సివిల్స్‌లో 35వ ర్యాంకు దక్కించుకున్నాడు. ఇక కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం తుంగెడ గ్రామానికి..

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌- 2022 తుది ఫలితాల్లో తెలుగు తేజాలు ఓ మెరుపు మెరిసారు. తెలుగు విద్యార్ధులు ఎప్పటిలానే మంచి ర్యాంకులను సాధించారు.  సివిల్స్‌లో ర్యాంక్‌ సాధించడం కోట్లాది మంది కల. అయితే వాటిని కొద్దిమంది మాత్రమే నెరవేర్చుకుంటారు. ఈ ఏడాది తెలుగు విద్యార్థులు కొంతమంది అభ్యర్థులు సివిల్స్‌లో జయకేతనం ఎగురవేశారు.  తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మెరుగైన ర్యాంకులు సాధించారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు కుమార్తె నూకల. ఉమా హారతి UPSC ఫలితాల్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించారు. అలాగే తిరుపతికి చెందిన పవన్ దత్తా 22వ ర్యాంకు.. వరంగల్ కు చెందిన విద్యార్థి అశ్రీత్ 40 ర్యాంకులతో మెరిశారు. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి.. IAS అవ్వాలన్న తన కల నెరవేర్చుకోబోతున్నారు. సివిల్‌కి ఎలా ప్రిపేర్ అయ్యారు.. తన సక్సెస్ సీక్రేట్ ఎంటో అశ్రిత్ వారికి తెలుస్తుంది.

మరోవైపు చదువు ఒక్కటే తమ పరిస్థితులను మార్చగలదని నమ్మిన గ్రామీణ విద్యార్థులు.. సివిల్స్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. సివిల్స్ ఫలితాల్లో సత్త చాటిన మరో ఉమ్మడి ఆదిలాబాద్ బిడ్డ అజ్మీరా సాంకేత్‌ సివిల్స్‌లో 35వ ర్యాంకు దక్కించుకున్నాడు. ఇక కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రే రావయ్య ఆల్ ఇండియాలో 410వ ర్యాంకును సాధించుకున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన రేవయ్య.

ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మరికొందరు విద్యార్థులు సివిల్స్‌లో దుమ్మురేపారు. తిరుపతికి చెందిన జీవీఎస్‌ పవన్‌ దత్తా 22 ర్యాంకు సాధించగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన శాఖమూరి శ్రీసాయి అశ్రిత్‌ 40, సాయి ప్రణవ్‌ 60, ఆవుల సాయికృష్ణ 94, హైదరాబాద్‌‌కు చెందిన నిధి పాయ్‌ 110, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంత్‌ కుమార్‌ 157, కమతం మహేశ్‌కుమార్‌ 200, రావుల జయసింహారెడ్డి 217, విశాఖకు చెందిన సాహిత్య 243, అంకుర్‌ కుమార్‌ 257, బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్‌.చేతనా రెడ్డి 346, శృతి యారగట్టి ఎస్‌ 362, సోనియా కటారియా 376, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఇప్పలపల్లి సుష్మిత 384, రేవయ్య 410, సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌ రెడ్డి 426, బొల్లిపల్లి వినూత్న 462, రెడ్డి భార్గవ్‌ 772, నాగుల కృపాకర్‌ 866 ర్యాంకులతో మెరిసిపోయారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages