TSPSC Group 1 Exam Date 2023: జూన్‌ 11న టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాత పరీక్ష.. మళ్లీ ఓఎంఆర్‌ పద్ధతిలోనే – Telugu News | TSPSC Group 1 Revised Exam Date 2023: TSPSC Group 1 Preliminary Exam will be held on June 11 through offline mode - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 17 May 2023

TSPSC Group 1 Exam Date 2023: జూన్‌ 11న టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాత పరీక్ష.. మళ్లీ ఓఎంఆర్‌ పద్ధతిలోనే – Telugu News | TSPSC Group 1 Revised Exam Date 2023: TSPSC Group 1 Preliminary Exam will be held on June 11 through offline mode

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్‌ 11న నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెల్లడించింది. ఈ పరీక్షను పూర్తిగా ఆఫ్‌లైన్‌లో, ఓఎంఆర్‌ పద్ధతిలోనే జరుపనున్నట్లు కమిషన్‌ స్పష్టం చేసింది. కాగా మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్‌ 26న..

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్‌ 11న నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెల్లడించింది. ఈ పరీక్షను పూర్తిగా ఆఫ్‌లైన్‌లో, ఓఎంఆర్‌ పద్ధతిలోనే జరుపనున్నట్లు కమిషన్‌ స్పష్టం చేసింది. కాగా మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా… అదే ఏడాది అక్టోబర్‌ 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్ష 2,85,916 మంది రాశారు. వారిలో25,050 మందిని మెయిన్స్‌కు ఎంపికయ్యారు. అయితే అనూహ్యంగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూడటంతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌తో పాటు మరికొన్ని పరీక్షలను రద్దు చేసింది.

అనంతరం మళ్లీ కొత్త తేదీలను ప్రకటించిన కమిషన్ గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 25 వేలలోపు అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌) పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో 25 వేల నుంచి 50 వేలలోపు మంది అభ్యర్థులు ఉంటే, రెండు సెషన్లలో పరీక్షను పూర్తిచేసి, మార్కులను నార్మలైజేషన్‌ పద్ధతిలో లెక్కిస్తున్నారు. ఇక లక్ష కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే మాత్రం ఓఎంఆర్‌ పద్ధతిలోనే పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు 2 లక్షల 80 వేల మంది హాజరుకానుండగా ఈ పరీక్షను ఓఎంఆర్‌ పద్ధతిలోనే నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages