TSPSC: పేపర్‌ లీకేజీ కేసులో కీలక పరిణామం.. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సెక్రటరీలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ | ED interrogated TSPSC Chairman and Secretary in paper leakage case Telugu Local News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 May 2023

TSPSC: పేపర్‌ లీకేజీ కేసులో కీలక పరిణామం.. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సెక్రటరీలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ | ED interrogated TSPSC Chairman and Secretary in paper leakage case Telugu Local News

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. TSPSC ఛైర్మన్‌, సెక్రటరీని సుదీర్ఘంగా విచారించింది ఈడీ. పరీక్షల నిర్వహణ, క్వశ్చన్ పేపర్ల తయారీ, ప్రశ్న పత్రాల భద్రత వంటి అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. తెలంగాణలో సంచలనంగా TSPSC పేపర్‌ లీకేజీ కేసుని ఈడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎపిసోడ్‌లో..

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. TSPSC ఛైర్మన్‌, సెక్రటరీని సుదీర్ఘంగా విచారించింది ఈడీ. పరీక్షల నిర్వహణ, క్వశ్చన్ పేపర్ల తయారీ, ప్రశ్న పత్రాల భద్రత వంటి అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. తెలంగాణలో సంచలనంగా TSPSC పేపర్‌ లీకేజీ కేసుని ఈడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎపిసోడ్‌లో భారీగా డబ్బులు చేతులు మారడంతోపాటు.. విదేశాల నుంచి కూడా నగదు వచ్చిందన్న ఆరోపణలు రావడంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా TSPSC ఛైర్మన్ జనార్దన్, సెక్రటరీ అనితా రామచంద్రన్‌కు నోటీసులు ఇవ్వడంతో.. ఇద్దరూ విచారణకు హాజరయ్యారు. అసలు ఏం జరిగింది? మీ దగ్గరున్న సమాచారం ఏంటన్న వివరాలపై ప్రశ్నించి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. పరీక్షల నిర్వహణ, క్వశ్చన్ పేపర్ల తయారీ, ప్రశ్న పత్రాల భద్రత అంశాలపై వివరాలు సేకరించారు. కమిషన్ సిబ్బంది ఎగ్జామ్స్‌ రాయాలంటే ఉన్న నిబంధనలపై ఆరా తీసింది ఈడీ. లీకేజీ తర్వాత తీసుకున్న చర్యలపైనా ప్రశ్నిoచింది.

ఇప్పటికే ఈడీ అధికారులు సెక్షన్ ఆఫీసర్‌ శంకరలక్ష్మితోపాటు…ప్రధాన నిందితులు ప్రవీణ్ , రాజశేఖర్ రెడ్డిని కూడా విచారించారు. పేపర్‌ కొనుగోలులో మొత్తం 31 లక్షల లావాదేవీలు జరిగినట్లు ఇప్పటికే గుర్తించింది సిట్. అయితే ఈ 31 లక్షలతోపాటు.. విదేశాల నుంచి కూడా డబ్బు వచ్చిందన్న ఆరోపణలపై విచారణ జరుపుతోంది ఈడీ. ప్రశ్నపత్రాలను అమ్మకానికి పెట్టడం ద్వారా ఎంత వసూలు చేశారు? ఆ డబ్బులు ఏ రూపంలో తీసుకున్నారు? హవాలా నగదు లావాదేవీలు ఏమైనా జరిగాయా? అనే కోణంలో ఈడీ విచారణ జరపుతోంది.

ఇదిలా ఉంటే పేపర్‌ లీకేజీ కేసులో సిట్ ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్ చేసింది. దాదాపు 400 మందిని ప్రశ్నించింది. దర్యాప్తు నివేదికలను కూడా ఎప్పటికప్పుడు కోర్టుకు అందిస్తూ వస్తోంది. అటు ఈ కేసు ఇప్పటికే పొలిటికల్ టర్న్ తీసుకుంది. CBIకి అప్పగించాలంటూ కాంగ్రెస్‌ వేసిన పిటిషన్‌ను ఈ మధ్యే జూన్‌5వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

ఇవి కూడా చదవండి



మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages