ఈ విద్యా సంవత్సరంకు B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లుగా ప్రారంభించనున్నట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. తార్నాక TSRTC నర్సింగ్ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్ మెంట్ కోటాలో B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ దవాఖానలో నర్సింగ్ కళాశాల ఈ విద్యాసంవత్సరం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంకు B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లుగా ప్రారంభించనున్నట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. తార్నాక TSRTC నర్సింగ్ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్ మెంట్ కోటాలో B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నాలుగేళ్ళ కోర్సులో చేరడానికి ఇంటర్ బైపీసీ ఉతీర్ణులైన 17 ఏళ్లు నిండిన విద్యార్థినులు అర్హులని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు 9491275513, 7995165624 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.
హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ దవాఖానలో నర్సింగ్ కళాశాలను 2022 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. ఇందుకు రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అనుమతి ఉంది. కన్వీనర్ కోటాలో 30 సీట్లు, యాజమాన్య కోటాలో 20 సీట్లు చొప్పున మొత్తం 50 సీట్లు ఉంటాయి. ఆర్టీసీ సిబ్బందికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు తార్నాక దవాఖానను ఆధునీకరిస్తుంది.
తార్నాక #TSRTC నర్సింగ్ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్ మెంట్ కోటాలో https://t.co/LjX6Unyovl నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. నాలుగేళ్ళ కోర్సులో చేరడానికి ఇంటర్ బైపీసీ ఉతీర్ణులైన 17 ఏళ్లు నిండిన విద్యార్థినులు అర్హులు. ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు… pic.twitter.com/pODODr1jyc
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) May 26, 2023
తార్నాక ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత అత్యుత్తమంగా అందించడం, సంస్థ ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ఆధునీకరణ పనులు చేపట్టారు. ఇక్కడ మౌలిక వసతులన అభివృద్ధి పరిచే దిశలో కూడా తగు చర్యలు తీసుకుంటామన్నారు. నర్సింగ్ కళాశాల ప్రవేశ వివరాలు, ఇతర సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-68153333, 040-30102829 లేదా వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. నర్సింగ్ కళాశాల ముఖ్య వైద్యాధికారి, సూపరింటెండెంట్‌ను నేరుగా సంప్రదించవచ్చునని వెల్లడించారు ఎండీ వీసీ సజ్జనార్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి
No comments:
Post a Comment