TS Polycet 2023 Results: రేపే తెలంగాణ పాలీసెట్‌-2023 ఫలితాలు.. ఎన్ని గంటల కంటే.. – Telugu News | TS Polycet 2023 Result will be announced tomorrow; Direct link to check results - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 25 May 2023

TS Polycet 2023 Results: రేపే తెలంగాణ పాలీసెట్‌-2023 ఫలితాలు.. ఎన్ని గంటల కంటే.. – Telugu News | TS Polycet 2023 Result will be announced tomorrow; Direct link to check results

తెలంగాణ పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet 2023) పరీక్ష ఫలితాలు రేపు (మే 26) వెలువడనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ (ఎస్‌బీటీఈటీ) కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఒక ప్రకటనలో..

తెలంగాణ పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet 2023) పరీక్ష ఫలితాలు రేపు (మే 26) వెలువడనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ (ఎస్‌బీటీఈటీ) కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మే 17న జరిగిన పాలీసెట్‌ పరీక్ష ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదలవుతాయని ఆయన వెల్లడించారు. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

పాలీసెట్‌ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నీక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో న‌డుస్తోన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ అగ్రిక‌ల్చర్‌ యూనివ‌ర్సిటీ, పీవీ న‌ర్సింహారావు తెలంగాణ యూనివ‌ర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నీక్ కోర్సులు అందించే సంస్థల్లో సీట్లను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ సారి పాలీసెట్‌ ప్రవేశాల్లో బాసర ఆర్‌జీయూకేటీ చేరడం లేదని ఎస్‌బీటీఈటీ ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages