TS EAMCET: ఈసారి ఎంసెట్‌కు భారీగా పెరిగిన దరఖాస్తులు.. ఎన్ని అప్లికేషన్స్‌ వచ్చాయంటే.. | TSCHE Chairman Limbadri says applications for TS EAMCET have increased this year Telugu Education News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 May 2023

TS EAMCET: ఈసారి ఎంసెట్‌కు భారీగా పెరిగిన దరఖాస్తులు.. ఎన్ని అప్లికేషన్స్‌ వచ్చాయంటే.. | TSCHE Chairman Limbadri says applications for TS EAMCET have increased this year Telugu Education News

ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్‌కు భారీగా దరఖాస్తులు పెరిగాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు…

ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్‌కు భారీగా దరఖాస్తులు పెరిగాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఎంసెట్‌కు అదనంగా 50వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటికే 2లక్షలకు పైగా విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని పేర్కొన్నారు.

పెరిగిన దరఖాస్తుల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను పెంచుతున్నట్లు లింబాద్రి తెలిపారు. ఎంసెట్‌కు 28 కొత్తవి సహా మొత్తం 137 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి, ఆలస్యమైతే అనుమతించేది లేదని తెలిపారు. లాసెట్ ఒకే రోజు మూడు సెషన్స్‌లో నిర్వహిస్తామని, ఈసెట్ ఒకే పూటలో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లు ప్రాసెస్‌లో ఉందని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే జేఎన్‌టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్తగా బయోటెక్నాలజీ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. కొత్త కోర్సుల కోసం ప్రైవేట్‌ కాలేజీల దరఖాస్తులు ఏఐసీటీఈ పరిశీలనలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాలేజీల్లో తనిఖీలు మరో నాలుగైదు రోజుల్లో పూర్తవుతాయని వీసీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మే 10 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్‌, మెడికల్‌.. 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages