తెలంగాణ ఎంసెట్ ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఫలితాలకు సంబంధించిన షెడ్యూల్‌లో అధికారులు స్వల్ప మార్పులు చేసినట్లుగా తాజాగా తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ అగ్రికల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారని తెలిపారు.
విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఎంసెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి అధికారులు తీపి కబురు అందించారు. మే 25వ తేదీన టీఎస్ ఎంసెట్ – 2023 ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ అగ్రికల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే అనుకున్న సమయం కంటే కాస్తే ముందుగా విడుదల చేయనున్నట్లుగా సమాచారం. ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫలితాల ర్యాంకులను, మార్కులను విడుదల చేస్తారు. ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇక మెడికల్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంకర్ల వివరాలను కూడా వెల్లడించనున్నారు.
ఇదిలావుంటే, తెలంగాణలో 96.35 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 92.50 శాతం హాజరు నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా 97శాతం మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాశారు. ఈ నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్.. 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలను నిర్వహించారు. అగ్రికల్చర్ ప్రిలిమినరీ కీ ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించారు.
అలాగే ఇంజనీరింగ్ ప్రిలిమినరీ కీని ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. ఈ ఏడాది ఎంసెట్‌కు 3,20,683 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,01,789 మంది పరీక్ష రాశారు. 94.11శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఎంసెట్ ఫలితాలను టీవీ9 తెలుగులో వెంటనే తెలుసుకవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
No comments:
Post a Comment