TS Eamcet 2023 Hall Tickets: తెలంగాణ ఎంసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. రేపటితో ముగియనున్న దరఖాస్తులు | TS Eamcet Hall Tickets 2023 Released; 1.75 lakh students downloaded on the first day - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday 1 May 2023

TS Eamcet 2023 Hall Tickets: తెలంగాణ ఎంసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. రేపటితో ముగియనున్న దరఖాస్తులు | TS Eamcet Hall Tickets 2023 Released; 1.75 lakh students downloaded on the first day

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ హాల్‌టికెట్లు ఏప్రిల్ 30న‌ విడుదలయ్యాయి. హాల్‌ టికెట్లు విడుదలైన తొలి రోజే రాత్రి 8 గంటల వరకు దాదాపు 1.75 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు ఎంసెట్‌ కోకన్వీనర్‌ ప్రొఫెసర్‌ విజయకుమార్‌రెడ్డి..

TS Eamcet 2023 Hall Tickets: తెలంగాణ ఎంసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. రేపటితో ముగియనున్న దరఖాస్తులు

TS Eamcet Hall Tickets 2023

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ హాల్‌టికెట్లు ఏప్రిల్ 30న‌ విడుదలయ్యాయి. హాల్‌ టికెట్లు విడుదలైన తొలి రోజే రాత్రి 8 గంటల వరకు దాదాపు 1.75 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు ఎంసెట్‌ కోకన్వీనర్‌ ప్రొఫెసర్‌ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. వీరిలో 1,25,229 మంది ఇంజినీరింగ్‌ అభ్యర్ధులు ఉండగా, 50,004 మంది అగ్రికల్చర్‌ అభ్యర్థులు ఉన్నారు. ఎగ్జాం సెంటర్‌ ఎక్కడ వచ్చిందో తెలుసుకునేందుకు అధిక మంది విద్యార్ధులు హాల్‌ టికెట్లు విడుదలైన వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకున్నారని ఆయన తెలిపారు.

కాగా ఈ ఏడాది ఎంసెట్‌కు మొత్తం 3.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 55 శాతం మంది తొలి రోజే హాల్‌టికెట్లను పొందటం విశేషం. ఇక ఆన్‌లైన్‌ దరఖాస్త ప్రక్రియ ఆలస్య రుసుంతో మే 2వ తేదీ వరకు అంటే రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా ఎంసెట్‌ కోకన్వీనర్‌ ప్రొఫెసర్‌ విజయకుమార్‌రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్‌, 12 నుంచి 14వ తేదీ వరకు ఇంజినీరింగ్‌ విభాగంలో ఎంసెట్‌ పరీక్షలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages