Telangana: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. తల్లిదండ్రులకు చదువు భారం తగ్గించే నిర్ణయం – Telugu News | Telangana government decided to give free note books to students studying in government schools - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 4 May 2023

Telangana: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. తల్లిదండ్రులకు చదువు భారం తగ్గించే నిర్ణయం – Telugu News | Telangana government decided to give free note books to students studying in government schools

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి వర్క్‌ బుక్స్‌, నోట్‌ బుక్స్‌ ఉచితంగా అందిస్తామని చెప్పారు మంత్రి సబిత.

గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం స్కూల్స్ లో చదివే స్టూడెంట్స్ కు ఉచితంగా వర్క్‌ బుక్స్‌, నోట్‌ బుక్స్‌ అందజేస్తామని ప్రకటించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. విద్యార్థుల తల్లిదండ్రులకు భారం తగ్గించే విధంగా.. అలాగే రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈమేరకు ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వర్క్స్ బుక్స్, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు నోటు పుస్తకాలను ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు మంత్రి సబిత. తద్వారా రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

నూతన సచివాలయంలో విద్యాశాఖపై సమీక్ష చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డిజ సమీక్ష నిర్వహించారు.  అలాగే వర్క్ బుక్స్‌, నోట్‌ బుక్స్‌ను స్కూల్స్ ప్రారంభమయ్యే నాటికి అందజేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి. అదేవిధంగా రాష్ట్రంలోని విద్యార్థులందరికీ బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలను పాఠశాల పునః ప్రారంభమయ్యే నాటికి అందజేయాలని ఆదేశించారు. లాస్ట్ ఇయర్ పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం 132 కోట్లు ఖర్చు చేయగా, వచ్చే విద్యా సంవత్సరానికి 200 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. దాదాపు 150 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫామ్ లను స్కూల్స్ పునః ప్రారంభం నాటికి అందేజేసే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. జూన్ 12న బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌ల పంపిణీ చేపట్టాలని.. అందులో స్థానిక శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను భాగ్యస్వామ్యం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages