TS Inter 1st, 2nd Year Results 2023 Live Updates: తెలంగాణ ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. విద్యార్థుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తోంది. మరికాసేపట్లో ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి…

Telangana Inter Results Live
LIVE NEWS & UPDATES
-
09 May 2023 10:45 AM (IST)
ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తున్న మంత్రి సబితా..
-
09 May 2023 10:39 AM (IST)
ఆటంకాలు లేవని నిర్ధారణ అయ్యాకే..
ఫలితాల విడుదల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో అధికారులు.. పలు దఫాలుగా ట్రయల్‌రన్ చేశారు. అనంతరం సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంతో జీరో సాంకేతిక సమస్యలు నిర్ధారౖణెందని. దీంతో ఫలితాల వెల్లడికి ఎలాంటి ఆటంకాల్లేవని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే మరికాసేపట్లో ఫలితాలను విడుదల చేయనున్నారు.
-
09 May 2023 10:24 AM (IST)
ఎంత మంది పరీక్ష రాశారంటే..
ఈ ఏడాది మొత్తం తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. 5 లక్షల మంది ఫస్ట్ ఇయర్, 4.5 లక్షల మంది సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌కు హాజరయ్యారు. ఇదిలా ఉంటే రేపటి నుంచి తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.
-
09 May 2023 10:06 AM (IST)
ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి..
తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేయనున్నారు. నాంపల్లిల్లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. రిజల్ట్స్‌ను www.tv9telugu.comలో చూడొచ్చు
TS Inter 1st, 2nd Year Results 2023 Live Updates: తెలంగాణ ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. విద్యార్థుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తోంది. మరికాసేపట్లో ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ రిజల్ట్స్ కోసం టీవీ9 వెబ్‌సైట్‌లలో సింపుల్‌గా చెక్ చేసుకోండి..
Published On – May 09,2023 10:06 AM
No comments:
Post a Comment