SSC CGL 2023: డిగ్రీ అర్హతతో 7,500ల కేంద్ర కొలువులు.. దరఖాస్తు చేసుకున్నారా? నేటితో ముగుస్తున్న గడువు | SSC CGL 2023 Online Registration ends today for 7500 Posts; Apply here Directly - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 May 2023

SSC CGL 2023: డిగ్రీ అర్హతతో 7,500ల కేంద్ర కొలువులు.. దరఖాస్తు చేసుకున్నారా? నేటితో ముగుస్తున్న గడువు | SSC CGL 2023 Online Registration ends today for 7500 Posts; Apply here Directly

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌) పరీక్ష-2023కు ఆన్‌లైన్‌ దరఖాస్తులు నేటితో ముగియనుంది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో దాదాపు 7,500ల ఉద్యోగాలను ఈ పరీక్ష ద్వారా భర్తీ

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌) పరీక్ష-2023కు ఆన్‌లైన్‌ దరఖాస్తులు నేటితో ముగియనుంది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో దాదాపు 7,500ల ఉద్యోగాలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ/ ఎంబీఏ (ఫైనాన్స్) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి అభ్యర్ధులు ఎవరైనా మే 3, 2023వ తేదీన రాత్రి 11 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/మహిళలు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. టైర్‌-1/టైర్‌-2 రాత పరీక్షలు, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. మెరిట్‌ సాధించిన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,51,100 వరకు జీతంగా చెల్లిస్తారు. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు సూచిస్తోంది.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages