SSB Constable Jobs: అవివాహిత యువతీ యువకులకు సదావకాశం.. 543 కానిస్టేబుల్‌ కొలువులకు ఎస్‌ఎస్‌బీ నోటిఫికేషన్‌ – Telugu News | Sashastra Seema Bal Recruitment 2023 for 543 Constable (Group C Non Gazetted) Posts - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 21 May 2023

SSB Constable Jobs: అవివాహిత యువతీ యువకులకు సదావకాశం.. 543 కానిస్టేబుల్‌ కొలువులకు ఎస్‌ఎస్‌బీ నోటిఫికేషన్‌ – Telugu News | Sashastra Seema Bal Recruitment 2023 for 543 Constable (Group C Non Gazetted) Posts

భారత హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సశస్త్ర సీమా బాల్ (ఎస్‌ఎస్‌బీ).. 543 కానిస్టేబుల్ (గ్రూప్-సి నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అవివాహిత యువతీ యువకులెవరైనా..

భారత హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సశస్త్ర సీమా బాల్ (ఎస్‌ఎస్‌బీ).. 543 కానిస్టేబుల్ (గ్రూప్-సి నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వాషర్‌మ్యాన్, బార్బర్, సఫాయివాలా, టైలర్, గార్డెనర్, కోబ్లర్, కుక్, డ్రైవర్, వెటర్నరీ, కార్పెంటర్, బ్లాక్‌స్మిత్‌, వాటర్ క్యారియర్, పెయింటర్ కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. డ్రైవర్ పోస్టులకు తప్పనిసరిగా 21 నుంచి 27 ఏళ్లు ఉండాలి. వాషర్‌మన్, బార్బర్, సఫాయివాలా, టైలర్, గార్డెనర్, కోబ్లర్, కుక్, వాటర్ క్యారియర్ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్లు, ఇతర పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు (జూన్ 18, 2023) దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.100లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్ధులకు ఎటువంటి ఫీజు ఉండదు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages