NCERT Recruitment 2023: ఎన్సీఈఆర్టీలో 347 కొలువులకు నోటిఫికేషన్‌.. టెన్ట్/ఇంటర్‌/డిగ్రీ పాసైన వారు అర్హులు.. | NCERT New Delhi Recruitment 2023 for 347 Non Academic Posts; Check important details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 May 2023

NCERT Recruitment 2023: ఎన్సీఈఆర్టీలో 347 కొలువులకు నోటిఫికేషన్‌.. టెన్ట్/ఇంటర్‌/డిగ్రీ పాసైన వారు అర్హులు.. | NCERT New Delhi Recruitment 2023 for 347 Non Academic Posts; Check important details

కేంద్ర ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్ (NCERT).. 347 సూపరింటెండింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్‌ మేనేజర్‌, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్ తదితర..

కేంద్ర ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్ (NCERT).. 347 సూపరింటెండింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్‌ మేనేజర్‌, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, సౌండ్ రికార్డిస్ట్ గ్రేడ్-I, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ (నాన్‌ అకడమిక్‌) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టును బట్టి 10వ తరగతి/ 12వ తరగతి/ ఐటీఐ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ డిప్లొమా/ బీటెక్‌/ బీఈ/ ఎంటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ/ పీజీ/ పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ విద్యార్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో మే 19, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు పోస్టును బట్టి రూ.1000, రూ.1200, రూ.1500 రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీఈ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఎంపికైన వారికి నెలకు రూ.20,200ల నుంచి రూ.39,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా కల్పిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి



నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages