Layoff: మళ్లీ మొదలైన ఉద్యోగుల తొలగింపు.. ఏకంగా 10 వేల మందిని ఇంటికి పంపుతోన్న టెక్‌ దిగ్గజం. – Telugu News | Layoffs Meta eliminating 10000 employees along with top executives in india - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 27 May 2023

Layoff: మళ్లీ మొదలైన ఉద్యోగుల తొలగింపు.. ఏకంగా 10 వేల మందిని ఇంటికి పంపుతోన్న టెక్‌ దిగ్గజం. – Telugu News | Layoffs Meta eliminating 10000 employees along with top executives in india

టెక్‌ రంగంలో మరోసారి ఉద్యోగాల తొలగింపు ఊపందుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఆగిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటోన్న సమయంలో తాజాగా టెక్‌ దిగ్గజం ఊహించని షాక్‌ ఇచ్చింది. ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మార్చిలో…

టెక్‌ రంగంలో మరోసారి ఉద్యోగాల తొలగింపు ఊపందుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఆగిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటోన్న సమయంలో తాజాగా టెక్‌ దిగ్గజం ఊహించని షాక్‌ ఇచ్చింది. ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మార్చిలో ప్రకటించిన ప్రణాళికలో భాగంగానే ఉద్యోగుల తొలగింపు చేపట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఉద్యోగుల తొలగింపుల్లో భాగంగా భారత్‌లోనూ కీలక పదవుల్లో ఉన్న వారు ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇటీవలి రౌండ్‌లో మెటా రిట్రెంచ్‌మెంట్‌లో భారత్ నుంచి చాలా మంది పేర్లను జాబితాలో చేర్చింది.

ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ అవినాష్ పంత్, డైరెక్టర్, మీడియా పార్టనర్‌షిప్ హెడ్ సాకేత్ ఝా సౌరభ్‌లను మెటా తొలగించింది. ఈ రౌండ్ తొలగింపులలో మార్కెటింగ్, సైట్ భద్రత, ఎంటర్‌ప్రైజ్ ఇంజనీరింగ్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, కంటెంట్ స్ట్రాటజీ, కార్పొరేట్ కమ్యూనికేషన్‌లో పనిచేస్తున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఉద్యోగులు కోల్పోయిన వారు లింక్‌డిన్‌లో తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

ఇదిలా ఉంటే మెటా ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి కాదు.. గతేడాది నవంబర్‌లో కూడా ఏకంగా 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. గత కొన్ని రోజులుగా మెటా ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో పాటు ద్రవ్యోల్బణం, డిజిటల్ ప్రకటనల తగ్గింపు కారణంగా కంపెనీపై భారం పెరుగుతోంది. దీంతో ఉద్యోగుల తొలగింపు తప్పడంలేదు. అదేవిధంగా తన ఖర్చులను తగ్గించడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి పెట్లేందుకు ప్రయత్నిస్తోంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages