CBSE Results 2023: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఈ లింక్‌లో ఇలా చూసుకోండి – Telugu News | CBSE Results 2023 declared, here’s how to check marks online at results.cbse.nic.in or cbseresults.nic.in - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 12 May 2023

CBSE Results 2023: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఈ లింక్‌లో ఇలా చూసుకోండి – Telugu News | CBSE Results 2023 declared, here’s how to check marks online at results.cbse.nic.in or cbseresults.nic.in

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న CBSE 12వ తరగతి ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో(cbseresults.nic.in) అందుబాటులో ఉన్నాయి.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు పరీక్ష జరిగింది. దాదాపు 16.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. CBSE బోర్డు 12వ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సంవత్సరం మొత్తం ఉత్తీర్ణత శాతం 87.33% గత సంవత్సరాల కంటే మెరుగ్గా ఉంది. ఈ ఫలితాల్లో త్రివేండ్రం మొదటి స్థానంలో నిలిచింది. బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 98.64 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. చెన్నై 97.40 శాతంతో మూడో స్థానంలో నిలిచింది.  ఈ ఏడాది CBSE బోర్డ్ 12వ ఫలితాల్లో త్రివేండ్రం విద్యార్థులు అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం సాధించారు. ఇక్కడ మొత్తం 99.91 శాతం మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.

అయితే, CBSE బోర్డు 12వ ఫలితాలు వెలువడ్డాయి కానీ ఈసారి కూడా టాపర్ల జాబితా అంటే మెరిట్ జాబితా విడుదల చేయలేదు.ఇదిలావుంటే, CBSE బోర్డ్ 12లో ఈ సంవత్సరం నవోదయ విద్యాలయ విద్యార్థుల పనితీరు అద్భుతంగా ఉంది. ఇక్కడ మొత్తం 97.51 శాతం మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.

CBSE బోర్డు 12వ ఫలితాన్ని తనిఖీ చేయడానికి విద్యార్థులకు రోల్ నంబర్, పాఠశాల సంఖ్య, పుట్టిన తేదీ అవసరం. ఈ వివరాలు అడ్మిట్ కార్డ్ నుండి అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 10వ తరగతి ఫలితాలు కూడా ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని కెరీర్ అండ్ జాబ్ న్యూస్ కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages