BEL Bengaluru Jobs 2023: బీఈ/బీటెక్ నిరుద్యోగులకు అలర్ట్.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 428 కొలువులు..పూర్తి వివరాలివే – Telugu News | BEL Bengaluru Recruitment 2023 for 428 Project Engineer, Trainee Engineer and other Posts; Apply online - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 4 May 2023

BEL Bengaluru Jobs 2023: బీఈ/బీటెక్ నిరుద్యోగులకు అలర్ట్.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 428 కొలువులు..పూర్తి వివరాలివే – Telugu News | BEL Bengaluru Recruitment 2023 for 428 Project Engineer, Trainee Engineer and other Posts; Apply online

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన 428 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ట్రైనీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులు 101, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌..

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన 428 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ట్రైనీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులు 101, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు 327 వరకు ఉన్నాయి. ఈ  పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల పాటు పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు ఏప్రిల్ 1, 2023వ తేదీ నాటికి 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మే 18, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు రూ.400లు, ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులకు రూ.150లు అప్లికేషన్‌ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ కేటగిరీలకు చెందినవారు ఫీజు చెల్లించనవసరం లేదు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.30,000ల నుంచి రూ.55,000ల వరకు జీతంలోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • ఎలక్ట్రానిక్స్ పోస్టులు: 164
  • మెకానికల్ పోస్టులు: 106
  • కంప్యూటర్ సైన్స్ పోస్టులు: 47
  • ఎలక్ట్రికల్ పోస్టులు: 7
  • కెమికల్‌ పోస్టులు: 1
  • ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పోస్టులు: 2

ట్రైనీ ఇంజినీర్‌ విభాగంలో..

  • ఎలక్ట్రానిక్స్‌ పోస్టులు: 100
  • ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పోస్టులు: 1

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages