AP Polycet 2023 Counselling: రేపట్నుంచి ప్రారంభంకానున్న ఏపీ పాలీసెట్‌ కౌన్సెలింగ్.. ఫీజుల వివరాలు ఇవే.. – Telugu News | AP Polycet 2023 Counselling to begin from tomorrow, here’s important dates - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 24 May 2023

AP Polycet 2023 Counselling: రేపట్నుంచి ప్రారంభంకానున్న ఏపీ పాలీసెట్‌ కౌన్సెలింగ్.. ఫీజుల వివరాలు ఇవే.. – Telugu News | AP Polycet 2023 Counselling to begin from tomorrow, here’s important dates

ఆంధ్రప్రదేశ్‌లో పాలిసెట్‌ 2023 కౌన్సెలింగ్‌ రేపట్నుంచి (మే 25) ప్రారంభంకానుంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలు..

AP Polycet 2023 Counselling: రేపట్నుంచి ప్రారంభంకానున్న ఏపీ పాలీసెట్‌ కౌన్సెలింగ్.. ఫీజుల వివరాలు ఇవే..

AP Polycet 2023 Counselling

ఆంధ్రప్రదేశ్‌లో పాలిసెట్‌ 2023 కౌన్సెలింగ్‌ రేపట్నుంచి (మే 25) ప్రారంభంకానుంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. వివిధ ట్రేడుల్లో అందుబాటులో ఉన్న సీట్లకు మే 25వ తేదీ నుంచి జూన్‌ 1 వరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. కౌన్సెలింగ్‌కు సంబంధించి ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.700, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.250ల చొప్పున ఫీజు చెల్లించి ఆప్షన్లు నమోదు చేసుకోవల్సి ఉంటుంది. అలాగే 29వ తేదీ నుంచి జూన్‌ 5వ తేదీ వరకు మెరిట్‌ ఆర్డరు మేరకు ఆయా కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.

జూన్‌ 1, 2 తేదీల్లో ఒకటో ర్యాంకు నుంచి 50వేల వరకు, 3, 4 తేదీల్లో 50001 నుంచి 90,000 వరకు, 5, 6 తేదీల్లో 90,001 నుంచి ఆఖరి ర్యాంకుల వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. జూన్‌ 7న ఆప్షన్లు మార్చుకునేందుకు వీలుంటుంది. జూన్‌ 9న సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్‌ 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక కేటగిరీ క్రీడా, ఎన్‌సీసీ, ఆర్మీ, వికలాంగుల, ఇండియన్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అభ్యర్థులు జూన్‌ రెండో తేదీ నుంచి 5వ తేదీ వరకు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages