AP ICET 2023 Exam Date: ఏపీ ఐసెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల.. ఈ లింక్‌ ద్వారా డైరెక్ట్‌గా డైన్‌లోడ్‌ చేసుకోవచ్చు. – Telugu News | AP ICET 2023 Admit Card Released; direct like here - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 22 May 2023

AP ICET 2023 Exam Date: ఏపీ ఐసెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల.. ఈ లింక్‌ ద్వారా డైరెక్ట్‌గా డైన్‌లోడ్‌ చేసుకోవచ్చు. – Telugu News | AP ICET 2023 Admit Card Released; direct like here

ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023 (ఏపీ ఐసెట్‌) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఐసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా డేట్‌ ఆఫ్‌ బర్త్‌ వివరాలు నమోదు చేసి..

ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023 (ఏపీ ఐసెట్‌) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఐసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా డేట్‌ ఆఫ్‌ బర్త్‌ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 24, 25 తేదీల్లో రోజుకు 2 షిఫ్టుల ప్రకారం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్యర్యంలో జరగనున్నాయి. ఈ మేరకు విద్యార్ధులకు తెలియజేస్తూ ప్రకటన వెడుదల చేశారు.

కాగా ఏపీ ఐసెట్‌లో వచ్చిన ర్యాంకు ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఏపీలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ), మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

వెబ్‌సైట్‌లో ఇంటర్మీడియట్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ-2023 పరీక్షల హాల్‌టికెట్లు

అలాగే ఇంటర్మీడియట్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ-2023 పరీక్షల హాల్‌టికెట్లు కూడా విడుదలయ్యాయి. జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో కాలేజీల ప్రిన్సిపాళ్లు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసి, విద్యార్థులకు అందించాలని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు సూచించారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages