AP ICET 2023: రేపే ఏపీ ఐసెట్‌-2023 ప్రవేశ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ – Telugu News | AP ICET 2023 Exam Will Be Held Tomorrow; Check Exam Day Instructions and Guidelines - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 23 May 2023

AP ICET 2023: రేపే ఏపీ ఐసెట్‌-2023 ప్రవేశ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ – Telugu News | AP ICET 2023 Exam Will Be Held Tomorrow; Check Exam Day Instructions and Guidelines

ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023 (ఏపీ ఐసెట్‌) ప్రవేశ పరీక్ష మే 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు పరీక్షల నిర్వహణ ఛైర్మన్‌ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) ఉపకులపతి ప్రొఫెసర్‌ రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో..

ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023 (ఏపీ ఐసెట్‌) ప్రవేశ పరీక్ష మే 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు పరీక్షల నిర్వహణ ఛైర్మన్‌ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) ఉపకులపతి ప్రొఫెసర్‌ రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ఏపీలో 109, తెలంగాణలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమన్నారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షను రెండు విడతల్లో నిర్వహిస్తామన్నారు. మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. పరీక్షకు విద్యార్థులను గంటన్నర ముందునుంచి అనుమతిస్తామని అన్నారు.

ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49,162 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే హాల్‌టికెట్లను కూడా విడుదల చేశారు. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా డేట్‌ ఆఫ్‌ బర్త్‌ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లలో ఏవైనా పొరపాట్లుంటే హెల్ప్‌లైన్‌ కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చని ఆయన వివరించారు. కాగా ఏపీ ఐసెట్‌లో వచ్చిన ర్యాంకు ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఏపీలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ), మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages