AP Gurukula Entrance Results: ఏపీ గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల – Telugu News | Andhra Pradesh Gurukula 5th Class, Inter Entrance Exam 2023 Result out - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 May 2023

AP Gurukula Entrance Results: ఏపీ గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల – Telugu News | Andhra Pradesh Gurukula 5th Class, Inter Entrance Exam 2023 Result out

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి, జూనియర్‌ ఇంటర్‌ ప్రవేశాలకు ఏప్రిల్‌ 23న ప్రవేశ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను బాపట్ల జిల్లా కొల్లూరులోని క్యాంపు కార్యాలయంలో..

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి, జూనియర్‌ ఇంటర్‌ ప్రవేశాలకు ఏప్రిల్‌ 23న ప్రవేశ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను బాపట్ల జిల్లా కొల్లూరులోని క్యాంపు కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మంగళవారం (మే 9) విడుదల చేశారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా అయిదో తరగతిలో ప్రవేశాలకు 14,940 సీట్లు ఉండగా.. వీటి కోసం దాదాపు 55,485 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 46,019 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాశారు. ఈ పరీక్షల్లో అనంతపురానికి చెందిన పర్వత జనవై 50కి 50 మార్కులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినట్లు మంత్రి తెలిపారు. ఇక గురుకులాల్లో జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశం కోసం కేటాయించిన 14 వేల సీట్ల కోసం 38,195 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 31,245 మంది పరీక్ష రాశారు. తాజా ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పొందూరు సూర్యనేత్రే 100కు 92.5 మార్కులు పొంది ప్రథమ స్థానం నిలిచారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages