Andhra pradesh: నేడే ఏపీ పాలిసెట్‌ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఎలా చెక్‌ చేసుకోవాలంటే. – Telugu News | AP Polycet 2023 Results releasing today check here for full details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 20 May 2023

Andhra pradesh: నేడే ఏపీ పాలిసెట్‌ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఎలా చెక్‌ చేసుకోవాలంటే. – Telugu News | AP Polycet 2023 Results releasing today check here for full details

ఆంధ్రప్రదేశ్‌లో పాలిసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రోజు (శనివారం) ఉదయం 10.45 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విజయవాడలో ఫలితాలను విడుదల చేస్తారు. ఇదిలా ఉంటే ఏపీలో ఈ నెల 10వ తేదీన పాలిటెక్నిక్ ఉమ్మడి..

ఆంధ్రప్రదేశ్‌లో పాలిసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రోజు (శనివారం) ఉదయం 10.45 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విజయవాడలో ఫలితాలను విడుదల చేస్తారు. ఇదిలా ఉంటే ఏపీలో ఈ నెల 10వ తేదీన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్-2023)ను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,59,144 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా 1,43,625 మంది పరీక్షకు హాజరయ్యారు.

దరఖాస్తు చేసుకున్న వారిలో 96429 మంది బాలురు, 62715 మంది బాలికలు ఉన్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ను చెక్‌ చేసుకోవాలని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను సైతం ఈరోజే ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే పాలీసెట్ లో అభ్యర్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా వారికి సీట్లను కేటాయించనున్నారు. పాలిసెట్‌ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లను నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages