TS Inter, 10th class Result dates: తెలంగాణ టెన్త్‌, ఇంటర్‌ మూల్యాంకనం పూర్తి.. ఈ తేదీల్లో ఫలితాలు ప్రకటన | Telangana class 10th and Intermediate Results likely to be released by May 15 - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 24 April 2023

TS Inter, 10th class Result dates: తెలంగాణ టెన్త్‌, ఇంటర్‌ మూల్యాంకనం పూర్తి.. ఈ తేదీల్లో ఫలితాలు ప్రకటన | Telangana class 10th and Intermediate Results likely to be released by May 15

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యంకనం ముగిసింది. ఇంటర్‌ మార్కుల క్రోడీకరణ వేగవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఫలితాల కోసం ఎదురు చేస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు..

TS Inter, 10th class Result dates: తెలంగాణ టెన్త్‌, ఇంటర్‌ మూల్యాంకనం పూర్తి.. ఈ తేదీల్లో ఫలితాలు ప్రకటన

TS 10th and Inter Result date

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యంకనం ముగిసింది. ఇంటర్‌ మార్కుల క్రోడీకరణ వేగవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఫలితాల కోసం ఎదురు చేస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు మే 15 నాటికల్లా రిజల్ట్స్‌ విడుదలచేసేందుకు విద్యా శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో ఏడాది పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్హులు హాజరయ్యారు. ఇంటర్‌ మూల్యాంకన ఇప్పటికే ముగియడంతో మార్కులను మరోసారి పరిశీలించి, మార్కులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్‌ బోర్డ్‌కు పంపారు. డీకోడింగ్‌ ప్రక్రియ కూడా ముగిసింది. ట్రయల్‌ రన్‌ జరుగుతోందని, సాంకేతిక పరమైన లోపాలు పరిశీలించిన తర్వాత ఫలితాల విడుదల తేదీ ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అంతా సక్రమంగా జరిగితే మే రెండోవారం నాటికి.. అంటే 15వ తేదీలోగా ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నామని బోర్డు అధికారులు వెల్లడించారు.

ఇక పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం కూడా దాదాపు ముగింపు కొచ్చింది. కొన్ని కేంద్రాల్లో ఇంకా మూల్యాంకనం కొనసాగుతోందని, మూల్యాంకనం పూర్తికాగానే డీ కోడింగ్‌ చేసి, మార్కులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా బోర్డుకు పంపుతున్నారు. కాగా టెన్త్‌ పరీక్షలకు 4.90 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. సాంకేతిక అంశాలపై పరిశీలన కొలిక్కివస్తే పదో తరగతి ఫలితాలను మే 10లోగా ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages