Telangana: పేపర్ లీకేజీ నేర్పిన పాఠం.. కీలక నిర్ణయం తీసుకున్న TSPSC | Telangana Government has issued approvals to fill up the post of Additional Secretary along with ten posts in TSPSC - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 21 April 2023

Telangana: పేపర్ లీకేజీ నేర్పిన పాఠం.. కీలక నిర్ణయం తీసుకున్న TSPSC | Telangana Government has issued approvals to fill up the post of Additional Secretary along with ten posts in TSPSC

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC)లో ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహార ఎంతటి సంచనలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేసు విచారణంలో భాగంగా ఏర్పాటు చేసిన సిట్ అధికారులు వేగం పెంచారు. వరుస అరెస్టులు చేస్తూ.. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఓవైపు…

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC)లో ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహార ఎంతటి సంచనలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేసు విచారణంలో భాగంగా ఏర్పాటు చేసిన సిట్ అధికారులు వేగం పెంచారు. వరుస అరెస్టులు చేస్తూ.. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఓవైపు కేసు విచారణ కొనసాగుతుంటే మరో వైపు టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళను ప్రారంభించింది. ఇందులో భాగంగానే పది కొత్త పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప‌రీక్ష‌ల కంట్రోల‌ర్, డిప్యూటీ కంట్రోల‌ర్, అసిస్టెంట్ కంట్రోల‌ర్, చీఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్, చీఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ సెక్యూరిటీ ఆఫీస‌ర్, సీనియ‌ర్, జూనియ‌ర్ నెట్ వ‌ర్క్ అడ్మినిస్ట్రేట‌ర్, సీనియ‌ర్, జూనియ‌ర్ ప్రోగ్రామ‌ర్ పోస్టుల‌తో పాటు జూనియ‌ర్ సివిల్ జ‌డ్జి కేడ‌ర్‌లో లా ఆఫీస‌ర్ పోస్టును మంజూరు చేశారు. ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ ప్ర‌తిపాద‌న‌లను ప్రభుత్వం ఆమోదించింది.

ఇక టీఎస్‌పీఎస్సీ అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా బీఎం సంతోష్ నియామ‌కం అయ్యారు. ఐఏఎస్ ఆఫీస‌ర్ సంతోష్ టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌ల కంట్రోల‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ మేర‌కు బీఎం సంతోష్‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే బీఎం సంతోష్‌ను ఔట‌ర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్ట‌ర్ బాధ్య‌త‌ల నుంచి బ‌దిలీ చేశారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages