కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ).. 46 అకౌంటెంట్/ ఆఫీస్ సూపరింటెండెంట్ కమ్ అకౌంటెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర (నాన్ టీచింగ్) పోస్టుల..
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ).. 46 అకౌంటెంట్/ ఆఫీస్ సూపరింటెండెంట్ కమ్ అకౌంటెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర (నాన్ టీచింగ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టును బట్టి కామర్స్ డిగ్రీ/బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీ/ఏదైనా డిగ్రీ/ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్‌లో టైపింగ్ స్కిల్స్ ఉండాలి. పోస్టును బట్టి సంబంధిత పనిలో ఏడాది నుంచి పదేళ్ల అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఆయా పోస్టును బట్టి 30 , 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మే 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా ఈడబ్ల్యూఎస్/జనరల్ అభ్యర్ధులు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులు రూ.600లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీఎస్ అభ్యర్ధులకు ఎటువంటి ఫీజు లేదు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.19,900ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment