NLC Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. మార్కుల ఆధారంగానే ఎంపిక | NLC Recruitment NLC Invites applications for apprentice posts Telugu Education News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday 27 April 2023

NLC Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. మార్కుల ఆధారంగానే ఎంపిక | NLC Recruitment NLC Invites applications for apprentice posts Telugu Education News

నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. చెన్నై హెడ్‌ క్వార్టర్స్‌గా పనిచేసే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌, టెక్నిషియన్‌, ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. చెన్నై హెడ్‌ క్వార్టర్స్‌గా పనిచేసే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌, టెక్నిషియన్‌, ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 163 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో గ్రాడ్యుయేట్ /డిగ్రీ (ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్) అప్రెంటిస్ (35), టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ (42), ఐటీఐ అప్రెంటిస్ (86) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి



* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంజనీరింగ్/టెక్నాలజీలో విగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్‌ పోస్టులకు ఎంబీఏ (హెచ్ఆర్) /ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ డిప్లొమా (పర్సనల్ మేనేజ్‌మెంట్/పర్సనల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇండస్ట్రియల్ పర్సన్) పూర్తి చేసి ఉండాలి. అలాగే టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ డిప్లొమా పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఇంజనీరింగ్‌/టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారుడిప్లొమా (ఇంజనీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఐటీఐ అప్రెంటిస్ పోస్టులకు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

* ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయసు 14 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను సంబంధిత విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్‌ 30వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లి్‌క్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తలకోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages