NIFT Hyderabad Jobs 2023: హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో గ్రూప్‌ ‘సీ’ ఉద్యోగాలు.. ఇంటర్‌/డిగ్రీ అర్హత.. | NIFT Hyderabad Recruitment 2023 for 11 Group ‘C’ Posts. Check Application Details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 15 April 2023

NIFT Hyderabad Jobs 2023: హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో గ్రూప్‌ ‘సీ’ ఉద్యోగాలు.. ఇంటర్‌/డిగ్రీ అర్హత.. | NIFT Hyderabad Recruitment 2023 for 11 Group ‘C’ Posts. Check Application Details

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌).. శాశ్వత ప్రాతిపదికన 11 గ్రూప్‌ ‘సీ’ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌).. శాశ్వత ప్రాతిపదికన 11 గ్రూప్‌ ‘సీ’ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంటర్మీడియట్‌/డిప్లొమా/ ఐటీఐ/ బీఎస్సీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు పని అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 27 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 30, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయలో జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.250 అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ప్రాక్టికల్‌ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌, రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • అసిస్టెంట్‌ వార్డెన్‌ (మహిళ) పోస్టులు: 2
  • నర్సు (మహిళ) పోస్టులు: 1
  • అసిస్టెంట్‌(ఫైనాన్షియల్‌ అండ్‌ అకౌంట్స్‌) పోస్టులు: 2
  • జూనియర్‌ అసిస్టెంట్ పోస్టులు: 2
  • ల్యాబ్‌ అసిస్టెంట్ పోస్టులు: 3
  • లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు: 1

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages