KVS Admission: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్‌కి ఎవరు అర్హులు.? ఎలా ఎంపిక చేస్తారో తెలుసా.? | Admission procedure for kendriya vidyalaya admission 2023 and eligibility criteria Telugu Education News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 2 April 2023

KVS Admission: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్‌కి ఎవరు అర్హులు.? ఎలా ఎంపిక చేస్తారో తెలుసా.? | Admission procedure for kendriya vidyalaya admission 2023 and eligibility criteria Telugu Education News

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్‌ పొందాలని చాలా మంది భావిస్తుంటారు. తమ చిన్నారులను ఈ విద్యాలయాల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు సైతం ఆసక్తిచూపిస్తుంటారు. నామమాత్రపు ఫీజులతో సీబీఎస్‌ఈ సిలబస్‌ విద్యాబోధన, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం పేరెంట్స్‌ కేవీలవైపు..

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్‌ పొందాలని చాలా మంది భావిస్తుంటారు. తమ చిన్నారులను ఈ విద్యాలయాల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు సైతం ఆసక్తిచూపిస్తుంటారు. నామమాత్రపు ఫీజులతో సీబీఎస్‌ఈ సిలబస్‌ విద్యాబోధన, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం పేరెంట్స్‌ కేవీలవైపు ఆకర్షితులయ్యేందుకు కారణాలు చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన (KVS) తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసింది. మార్చి 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అసలు కేవీల్లో అడ్మిషన్‌ పొందడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి.? విద్యార్థులను ఏ ప్రాతిపాదికన ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

* కేంద్రీయ విద్యాలయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది.

ఇవి కూడా చదవండి



* మొత్తం సీట్లలో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.

* ఒకటవ తరగతిలో ప్రవేశం పొందాలంటే మార్చి 31 నాటికి విద్యార్థి వయసు 6 నుంచి 8 ఏళ్ల మధ్య ఉండాలి. రెండో తరగతి, మూడో తరగతిలో ప్రవేశానికి ఏడు నుంచి తొమ్మిదేళ్ల మధ్య.. నాలుగో తరగతికి 8-10, అయిదో తరగతికి 9-11, ఆరుకు 10-12, ఏడుకు 11-13, ఎనిమిదికి 12-14, తొమ్మిదికి 13-15, పదికి 14-16 ఏళ్లు ఉండాలి.

ఎలా ఎంపిక చేస్తారంటే..

8వ తరగతి వరకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా ప్రయారిటీ కేటగిరీ ద్వారా ఆధారంగా ఎంపిక చేస్తారు. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇక పదకొండో తరగతిలో చేరే వారిని పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఒకవేళ 10వ తరగతిలో సీట్లు మిగిలితే ప్రవేశాలు నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

* ఒకటో తరగతికి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ మార్చి 27 నుంచి ప్రారంభమవుతుండగా చివరి తేదీగా ఏప్రిల్‌ 17ని నిర్ణయించారు.

* రెండో తరగతి, ఆపై తరగతులకు (పదకొండో తరగతి మినహాయించి) ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఏప్రిల్‌ 3వ తేదీన ప్రారంభమవుతుండగా, ఏప్రిల్‌ 12ని చివరి తేదీగా నిర్ణించారు.

* 11వ తరగతికి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పదో తరగతి ఫలితాలు వెల్లడైన 10 రోజుల తర్వాత నుంచి ప్రారంభమవుతుంది.

పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ కోసం క్లిక్‌ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages