JEE Main 2nd Session Results 2023: జేఈఈ మెయిన్‌ మలి విడత ఫలితాల తేదీ విడుదల చేసిన NTA.. ఎప్పుడంటే.. | JEE Main 2nd Session 2023 Result to be released on April 29 - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 17 April 2023

JEE Main 2nd Session Results 2023: జేఈఈ మెయిన్‌ మలి విడత ఫలితాల తేదీ విడుదల చేసిన NTA.. ఎప్పుడంటే.. | JEE Main 2nd Session 2023 Result to be released on April 29

జేఈఈ మెయిన్‌-2023 తుది విడత మెయిన్‌ పరీక్షలు శనివారం (ఏప్రిల్‌ 15)తో ముగిశాయి. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఏప్రిల్‌ 29వ తేదీన విడుదల కానున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఇక జనవరిలో జరిగిన తొలి విడత మెయిన్, తాజా పరీక్షలు రెండింటికీ హాజరైన విద్యార్ధులు..

JEE Main 2nd Session Results 2023: జేఈఈ మెయిన్‌ మలి విడత ఫలితాల తేదీ విడుదల చేసిన NTA.. ఎప్పుడంటే..

JEE Main 2nd Session Results 2023

జేఈఈ మెయిన్‌-2023 తుది విడత మెయిన్‌ పరీక్షలు శనివారం (ఏప్రిల్‌ 15)తో ముగిశాయి. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఏప్రిల్‌ 29వ తేదీన విడుదల కానున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఇక జనవరిలో జరిగిన తొలి విడత మెయిన్, తాజా పరీక్షలు రెండింటికీ హాజరైన విద్యార్ధులు సాధించిన ఉత్తమ స్కోర్‌ను ఫైనల్‌ ర్యాంకుగా ప్రకటిస్తారు. జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి తొలి 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి నేషన్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ర్యాంకులు కేటాయించనుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ జూన్‌ 4వ తేదీన జరగనుంది. ఆ పరీక్ష రాయడానికి ఏప్రిల్‌ 30వ తేదీ నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలవనుంది. ఈ మేరకు ఐఐటీ గువాహటి ప్రకటించింది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులు ప్రకటించిన మరుసటి రోజు నుంచే అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌ 29న జేఈఈ మెయిన్‌ జనవరి (పేపర్‌-1)లో జరిగిన తొలివిడత పరీక్షకు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 8.24 లక్షల మంది హాజరయ్యారు. చివరి విడత (జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌)కు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 9 లక్షల మంది వరకు పరీక్షకు హాజరయ్యారు. అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు జేఈఈ మెయిన్‌-2022లో కటాఫ్‌ స్కోర్‌ కేటగిరీల వారీగా చూస్తే.. జనరల్‌ (అన్‌ రిజర్వుడ్‌) 88.4121383, ఈడబ్ల్యూఎస్‌ 63.1114141, ఓబీసీ 67.0090297, ఎస్‌సీ 43.0820954, ఎస్‌టీ 26.7771328గా నిర్ణయించారు. ఇక ఈ ఏడాది కటాఫ్‌ ఏ విధంగా ఉంటుందనే విషయంపై విద్యార్ధుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages