JEE Main 2023 Answer Key: జేఈఈ మెయిన్‌ (సెషన్‌-2) ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. రిజల్ట్స్‌ ఎప్పుడంటే.. | JEE Main 2023 Session 2 Primary Answer Key out; Check here directly - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 21 April 2023

JEE Main 2023 Answer Key: జేఈఈ మెయిన్‌ (సెషన్‌-2) ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. రిజల్ట్స్‌ ఎప్పుడంటే.. | JEE Main 2023 Session 2 Primary Answer Key out; Check here directly

జేఈఈ 2023 మెయిన్స్‌ సెషన్-2కు సంబంధించి ఆన్సర్‌ ‘కీ’ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బుధవారం (ఏప్రిల్‌ 19) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఆన్సర్‌ ‘కీ’ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్‌ కీతోపాటు..

జేఈఈ 2023 మెయిన్స్‌ సెషన్-2కు సంబంధించి ఆన్సర్‌ ‘కీ’ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బుధవారం (ఏప్రిల్‌ 19) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఆన్సర్‌ ‘కీ’ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్‌ కీతోపాటు విద్యార్ధుల ఆన్సర్ షీట్లు, క్వశ్చన్‌ పేపర్లను కూడా వెబ్‌సైల్‌లో అందుబాటులో ఉంచింది. సమాధానాలపై అభ్యంతరాలు లేవనెత్తడానికి ఏప్రిల్‌ 21 వరకు అవకాశం ఇచ్చింది. ప్రతి సమాధానికి రూ.200లు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ ఆన్సర్‌ కీతోపాటు ఫలితాలను విడుదల చేస్తారు.

మొదటి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు; రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఏప్రిల్‌ 29వ తేదీన విడుదల కానున్నట్లు ఎన్టీఏ ఇప్పటికే ప్రకటించింది కూడా. అనంతరం కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి తొలి 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి నేషన్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ర్యాంకులు కేటాయించనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ జూన్‌ 4వ తేదీన జరగనుంది. ఆ పరీక్ష రాయడానికి ఏప్రిల్‌ 30వ తేదీ నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages