కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో బాగంగా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో బాగంగా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 34 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సివిల్, ఎలక్ట్రికల్, S&T తదితర విభాగాల్లో వర్క్స్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఒక ఏడాది పని అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత కార్యాలయాల్లో నిర్వహించే కార్యాలయంలో హాజరుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 36,000 జీతంగా అందిస్తారు.
* ఇంటర్వ్యూలను ఏప్రిల్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
No comments:
Post a Comment