Inter Exams: ఇంటర్ స్టూడెంట్స్ అలెర్ట్.. ఎంసెట్లో ఇంటర్ వేయిటేజి రద్దు.. ఇకపై ర్యాంకు ఆధారంగానే.. | Telangana scraps 25 per cent inter weightage for EAMCET - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 20 April 2023

Inter Exams: ఇంటర్ స్టూడెంట్స్ అలెర్ట్.. ఎంసెట్లో ఇంటర్ వేయిటేజి రద్దు.. ఇకపై ర్యాంకు ఆధారంగానే.. | Telangana scraps 25 per cent inter weightage for EAMCET

ఇకపై ఎంసెట్లో వచ్చిన.. మార్కులతోనే ర్యాంకులను ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఎంసెట్‌ మార్కులకు 75 శాతం, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును ఇస్తున్నారు. ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎత్తివేయాలని ఉన్నత విద్యామండలి ప్రతిపాదనతో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణ ఎంసెట్లో ఇంటర్ వేయిటేజి రద్దు చేసింది ప్రభుత్వం. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని.. శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎంసెట్లో వచ్చిన.. మార్కులతోనే ర్యాంకులను ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఎంసెట్‌ మార్కులకు 75 శాతం, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును ఇస్తున్నారు. ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎత్తివేయాలని ఉన్నత విద్యామండలి ప్రతిపాదనతో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

2023-24 విద్యాసంవత్సరానికి ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉండదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న జీఓ సవరిస్తూ జీఓ 18 ని విడుదల చేసింది విద్యాశాఖ. ఇంటర్‌ విద్యార్ధులు బట్టీపట్టి 900 లకుపైగా మార్కులు పొందుతున్నారు. అదే ఎంసెట్‌లో కనీస మార్కులు కూడా పొందలేకపోతున్నారు. సబ్జెక్ట్ పరిజ్ఞానం లేనివారిని ఫిల్టర్ చేయాలనే ఉద్దేశ్యంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షలకు ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఎప్పుడో తొలగించిన సంగతి తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages