Google: ఉద్యోగులకు మరో షాక్‌ ఇచ్చిన గూగుల్‌.. ఖర్చు తగ్గించుకునేందుకు ఈసారి ఏం చేసిందంటే. | Google stops giving free snacks and food for their employees - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 3 April 2023

Google: ఉద్యోగులకు మరో షాక్‌ ఇచ్చిన గూగుల్‌.. ఖర్చు తగ్గించుకునేందుకు ఈసారి ఏం చేసిందంటే. | Google stops giving free snacks and food for their employees

ఆర్థికమాంద్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. బడా కంపెనీలు సైతం నిర్ధాక్షణ్యంగా ఉద్యోగులను తొలగించాయి. అప్పటి వరకు లక్షల్లో జీతాలు తీసుకున్న వారు కూడా ఉన్నపలంగా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది…

ఆర్థికమాంద్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. బడా కంపెనీలు సైతం నిర్ధాక్షణ్యంగా ఉద్యోగులను తొలగించాయి. అప్పటి వరకు లక్షల్లో జీతాలు తీసుకున్న వారు కూడా ఉన్నపలంగా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇలా ఉద్యోగులను తొలగించిన బడా కంపెనీల్లో గూగుల్‌ కూడా ఒకటి. ఈ ప్రపంచ దిగ్గజ సంస్థ ఏకంగా 12000 మందిని ఇంటికి పంపించిన విషయం తెలిసిందే. ఖర్చును తగ్గించుకునే క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించినట్లు గూగుల్‌ అప్పట్లో తెలిపింది.

ఇదిలా ఉంటే ఖర్చుల నియంత్రణలో భాగంగా ఈ దిగ్గజ సెర్చ్‌ ఇంజన్‌ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఉద్యోగుల జోలికి వెళ్లని గూగుల్‌ ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాలపై కోత పెట్టింది. గూగుల్‌ ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాల విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు స్నాక్స్‌, మీల్స్‌ వంటివి అందిస్తుంది. అయితే తాజాగా వీటిలో కోత పెట్టేందుకు గూగుల్ నిర్ణయం తీసుకుంది. ఖర్చుల నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ మేరకు గూగుల్‌ ఛీఫ్‌ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. ఇకపై ఉద్యోగులకు ఇచ్చే స్నాక్స్‌, లాండ్రీ సర్వీస్‌, మధ్యాహ్న భోజనాల వంటి వాటిని ఆపేయాలని గూగుల్‌ నిర్ణయించింది. ఇదిలా ఉంటే కాస్ట్ కంట్రోలింగ్‌లో భాగంగా కొత్త ఉద్యోగుల నియామకాలను సైతం గూగుల్‌ ఆపేసింది. మరి గూగుల్‌ ఇంతటితో ఆగుతుందా మళ్లీ ఉద్యోగుల తొలగింపు దిశగా అడుగులు వేస్తుందా చూడాలి.

ఇవి కూడా చదవండి



మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages