బీటెక్‌ చేసిన వారికి సదవకాశం.. హైదరాబాద్‌ ఈసీఎల్‌ఐలో ఉద్యోగాలు. ఆ రెండు రోజుల్లో ఇంటర్వ్యూలు. | ECIL Hyderabad conducting interviews for technical officer and project engineer posts Telugu Education News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday 4 April 2023

బీటెక్‌ చేసిన వారికి సదవకాశం.. హైదరాబాద్‌ ఈసీఎల్‌ఐలో ఉద్యోగాలు. ఆ రెండు రోజుల్లో ఇంటర్వ్యూలు. | ECIL Hyderabad conducting interviews for technical officer and project engineer posts Telugu Education News

ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో టెక్నికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి



* ఈసీఈ/ ఈటీసీ/ ఎలక్ట్రానిక్స్‌/ సీఎస్‌ఈ/ ఐటీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఎంపీసీ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఇంటర్వ్యూలో సీఎల్‌డీఎస్‌, నలంద కాంప్లెక్స్‌, ఈసీఐఎల్‌, హైదరాబాద్‌, 500062 అడ్రస్‌లో నిర్వహిస్తారు.

* టెక్నికల్ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 25,000, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకు నెలకు రూ. 24,500 చెల్లిస్తారు.

* ఇంటర్వ్యూలను ఏప్రిల్‌ 06, 07 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages